Roja : ‘జగనన్న ముద్దు – రోజా వద్దు’ నగరిలో నిరసన..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరి ఎమ్మెల్యే , మంత్రి రోజా కు నిద్ర పట్టకుండా చేస్తున్న సొంత పార్టీ కార్యకర్తలు నేతలు. 175 కు 175 సాదించాల్సిందే అంటూ జగన్ దిశా నిర్దేశం చేస్తూ వస్తుండగా…రోజా కు టికెట్ ఇస్తే ఓడిస్తాం అంటూ నగరి ప్రజలు హెచ్చరిస్తుండడం తో జగన్ కు ఏంచేయాలో తెలియడం లేదు. ఇప్పటికే 12 జాబితాలను రిలీస్ చేసిన జగన్.. ప్రతి నియోజకవర్గంలో ఆయా అభ్యర్థులపై సర్వేలు చేయించి ప్రజలు ఏమనుకుంటున్నారో అది […]

Published By: HashtagU Telugu Desk
Rojanagari

Rojanagari

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరి ఎమ్మెల్యే , మంత్రి రోజా కు నిద్ర పట్టకుండా చేస్తున్న సొంత పార్టీ కార్యకర్తలు నేతలు. 175 కు 175 సాదించాల్సిందే అంటూ జగన్ దిశా నిర్దేశం చేస్తూ వస్తుండగా…రోజా కు టికెట్ ఇస్తే ఓడిస్తాం అంటూ నగరి ప్రజలు హెచ్చరిస్తుండడం తో జగన్ కు ఏంచేయాలో తెలియడం లేదు. ఇప్పటికే 12 జాబితాలను రిలీస్ చేసిన జగన్.. ప్రతి నియోజకవర్గంలో ఆయా అభ్యర్థులపై సర్వేలు చేయించి ప్రజలు ఏమనుకుంటున్నారో అది తెలుసుకొని టికెట్ ఇస్తున్నారు. ఏమాత్రం సదరు అభ్యర్థి ఫై వ్యతిరేకత ఉన్న పక్కకు పెట్టేస్తున్నారు. ఇప్పటికే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలకు , మంత్రులకు షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో నగరి (Nagari) టికెట్ మరోసారి రోజా (Roja) కు ఇస్తే దగ్గరుండి ఓడిస్తాం అని ఆయా నియోజకవర్గ వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటీకే ఈ విషయాన్నీ జగన్ కు తెలియజేసారు. అయినప్పటికీ జగన్ ఎక్కడ మళ్లీ టికెట్ ఇస్తారో అని ప్రతి రోజు జగన్ కు తమ నిరసనల ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా నగరి(Nagari) నియోజకవర్గ ఐదు మండలాల వైసీపీ(YCP) నాయకులు రోజుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. తమ నియోజకవర్గానికి రోజా వొద్దని, ఆమెకు టికెట్ ఇవ్వొద్దని సీఎం జగన్‌ను అభ్యర్థించారు. ‘జగనన్న ముద్దు – రోజా వద్దు’ అంటూ నగరి నియోజకవర్గ 5 మండలాల వైసీపీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు. రోజాకు టిక్కెట్టు ఇవ్వొద్దని జగన్‌ను వేడుకుంటున్నామన్నారు. నగరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారని, రోజా చరిష్మాతో నగరిలో గెలిచే ప్రసక్తే లేదని వారు పేర్కొన్నారు. తాము సపోర్ట్ చేస్తేనే రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిందన్నారు. ఈసారి రోజాకు సీటు ఇవ్వొదని డిమాండ్ చేశారు. ఒకవేళ రోజాకు టికెట్ ఇస్తే తాము మద్ధతివ్వమని.. ఖచ్చితంగా ఓడిపోతుందని స్పష్టం చేశారు అసంతృప్త నేతలు.

Read Also : Danam Nagender : దానం కూడా కాంగ్రెస్ గూటికేనా..?

  Last Updated: 15 Mar 2024, 03:27 PM IST