Site icon HashtagU Telugu

Gali Bhanuprakash Nomination : గాలి భాను నామినేషన్ కు వచ్చిన జనాలని చూస్తే ..రోజాకు డిపాజిట్ కష్టమేనా..?

Nagari Tdp Assembly Candida

Nagari Tdp Assembly Candida

దేశ వ్యాప్తంగా ఎన్నికలకు సంబదించిన నాలుగో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇక నోటిఫికేషన్ వచ్చిందో లేదో తెలుగు రాష్ట్రాల్లో అసలైన ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ లో 17 ఎంపీ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుండగా..ఇటు ఏపీ లో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13 న పోలింగ్ జరగనుండగా..జూన్ 04 న ఫలితాలు రాబోతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ఈరోజు నామినేషన్ల పర్వం మొదలైందో లేదో ..చాలామంది తమ నామినేషన్లు వేసేందుకు పోటీ పడ్డారు. ఏపీలో అధికార పార్టీ అభ్యర్థుల కంటే ముందే కూటమి అభ్యర్థులు తమ నామినేషన్ ను దాఖలు చేసారు. ప్రతి ఒక్కరు భారీ ఎత్తున ర్యాలీతో బయలుదేరి తహశీల్దార్ ఆఫీస్ లో నామినేషన్ దాఖలు చేసారు. ఇక నగరి లో కూటమి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ నామినేషన్ (Gali Bhanuprakash Nomination) కార్యక్రమానికి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున అభిమానులు , పార్టీ శ్రేణులు , కార్యకర్తలు హాజరై సందడి చేసారు. ఇసుక వేస్తే రాలనంత జనం రావడం తో అక్కడ ఒక్కసారిగా జాతర వాతావరణం కనిపించింది. ఈ ప్రజలను చూస్తే రోజా మీద ఎంత కసిగా ఉన్నారో..ఎప్పుడెప్పుడు ఆమెను గద్దె దించుదామా అనే కోణంలో ఉన్నారో అర్ధం అవుతుంది.

నగరి లో గత మూడేళ్ళుగా రోజా (Roja) ఫై యావత్ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు..వైసీపీ నేతలు , శ్రేణులు సైతం రోజాకు ఈసారి టికెట్ ఇవ్వకూడదంటూ గట్టిగా హెచ్చరించిన జగన్ మాత్రం మరోసారి ఇచ్చారు. దీంతో వైసీపీ నేతలు , శ్రేణులు పెద్ద ఎత్తున టిడిపి లో చేరి..ఈరోజు భాను విజయానికి మీము ఉన్నాం అంటూ చెపుతున్నారు. నగరి లో ప్రజల టాక్ బట్టి చూస్తే ఈసారి రోజా కు డిపాజిట్ కూడా కష్టమే అని అంటున్నారు.

Read Also : Venigandla Ramu : గుడివాడ కు ఏంచేసావో చెప్పే ధైర్యం ఉందా..? అంటూ నానికి వెనిగండ్ల రాము సవాల్