AP Poll : నగరిలో రోజాకు టికెట్ ఇవ్వొద్దన్నా నేతపై వేటు

వడమాల పేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భరత్ నిర్ణయం తీసుకున్నారు

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 01:29 PM IST

మరో పది రోజుల్లో ఏపీ(AP)లో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నగరి(Nagari)లో వైసీపీ పార్టీ (YCP) లో కీలక పరిమాణం జరిగింది. నగరి టికెట్ రోజా (Roja) కు ఇవ్వొద్దంటూ అధిష్టానానికి లేఖ రాసిన నేతపై పార్టీ వేటు చేసింది. అతడ్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు సార్లు నగరి నుండి వరుస విజయాలు సాధించిన రోజా కు ఈసారి నియోజకవర్గ ప్రజలు గట్టి షాక్ ఇవ్వబోతున్నట్లు పలు సర్వేలు ఇప్పటికే తేల్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

రోజా రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా..అనేక దందాలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆమెపై ఆరోపణలు వినిపిస్తూ వస్తున్నాయి. సొంత పార్టీ నేతల దగ్గరి నుండి కూడా కమిషన్లు అడిగిందని అధిష్టానానికి తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా రోజా ఆగడాలు ఎక్కువయ్యాయి అని , ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వదంటూ పెద్ద ఎత్తున నేతలు లేఖలు రాసారు. ఆలా పిర్యాదు చేసినా వారిలో వడమాల పేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి (Muralidhar Reddy) కూడా ఒకరు. అయితే ఇప్పుడు మురళి ఫై పార్టీ వేటు వేసింది.

వడమాల పేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భరత్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉంటే ఇలా సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో మండలస్థాయి నేతను సస్పెండ్ చేయడం నగరి నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. మురని సస్పెండ్ చేయడం అది పార్టీకే నష్టమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Hindu Marriages : హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు