Nagababu : నాగబాబు పార్లమెంట్ స్థానం ఫిక్స్..?

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 12:19 PM IST

మెగా బ్రదర్ నాగబాబు బరిలో నిలిచే స్థానం ఫిక్స్ అయ్యిందా…? అంటే అవుననే తెలుస్తుంది. వాస్తవానికి ఈసారి నాగబాబు ఎన్నికల బరిలో నిల్చోనని చెప్పినప్పటికీ , ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నాగబాబు పోటీ చేయాలనీ ఫిక్స్ అయ్యాడు.

మరో రెండు నెలల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఏపీ(AP) లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే వైసీపీ(YCP) అధిష్ఠానం తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ వస్తుంది. ప్రస్తుతం సీఎం జగన్ (CM Jagan) రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ.. బహిరంగ సభలు పెడుతున్నారు. మరోవైపు టీడీపీ-జనసేన(TDP-Janasena) కూడా ఎన్నికల సమరంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఈ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ), జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) ల మధ్య సీట్ల పంపిణీపై చర్చలు జరుగుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో మెగాబ్రదర్ నాగబాబు కు సీటు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అనకపల్లి(Anakapalle) పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి నాగబాబు(Naga Babu) ను బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి 2009 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. కానీ సొంత నియోజకవర్గంలో ఓడిపోయి తిరుపతిలో గెలిచారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు. రెండింట ఓడిపోయారు. నాగబాబు నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి చవిచూశారు. దీంతో ఒక్క చిరంజీవి తప్ప సోదరులు ఇద్దరూ చట్టసభలకు ఎన్నిక కాలేదు. అయితే ఈసారి పవన్ తో పాటు నాగబాబు సైతం చట్టసభలకు ఎన్నిక కావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే నాగబాబు ఎన్నికల్లో పోటీ చేస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఎంపీగా గెలిచి నాగబాబు జాతీయస్థాయిలో పార్టీ వ్యవహారాలు నడిపితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే టిడిపి సైతం నాగబాబు కు టికెట్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

Read Also :  TDP-Janasena-BJP : బిజెపి కి 10 అసెంబ్లీ , 3 ఎంపీ సీట్ల ఇచ్చేందుకు బాబు ఫిక్స్..?