Site icon HashtagU Telugu

Janasena : వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ మీద రుద్దొద్దు – నాగబాబు స్వీట్ వార్నింగ్

nagababu warning

nagababu warning

ఏపీలో వారం క్రితం వరకు నారా లోకేష్ డిప్యూటీ సీఎం (Nara Lokesh Deputy CM) చేయాలనీ టీడీపీ వర్గీయులు , పవన్ కళ్యాణ్ ను సీఎం (Pawan Kalyan CM) చేయాలనీ జనసేన వర్గీయులు పెద్ద ఎత్తున డిమాండ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు పార్టీల అధిష్టానాలు ఈ డిమాండ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఎవరు కూడా వ్యక్తిగత డిమాండ్స్ చేయకూడదని, ఏంచేయాలో అధిష్టానానికి తెలుసనీ హెచ్చరించాయి. ఇదే విషయాన్నీ జనసేన నేత, నాగబాబు (Nagababu) జనసేన శ్రేణులకు మరోసారి తెలియజేసారు.

Krishna District Collector : కలెక్టర్ కు డాన్స్ వేసే స్వేచ్ఛ కూడా లేదా..?

జనసేనలో నాయకత్వంపై వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా ఉండాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టమైన సూచనలు చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ మీద రుద్దవద్దని, పార్టీ ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. జనసేన నేతలు వివాదాలకు దూరంగా ఉండాలని, పార్టీ అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాలను పాటించాలని నాగబాబు ఆదేశించారు. కొత్తగా పార్టీలో చేరిన నేతలకు కండువా కప్పి స్వాగతం పలుకుతూ, అధికారం దుర్వినియోగం చేయకుండా ప్రజల కోసం పని చేయాలనే మార్గదర్శకాలు ఇచ్చారు.

జనసేన ప్రజాసేవకు అంకితభావంతో పని చేసే వేదిక అని, స్వలాభం కోసం పార్టీలో చేరితే ఆ ఆలోచనలను మానుకోవాలని నాగబాబు హెచ్చరించారు. నిజాయితీ, నిస్వార్థ సేవతోనే జనసేనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు. జనసేన ప్రతి కార్యకర్తకు పార్టీ వృద్ధి కోసం పని చేయడం లక్ష్యమని, మేము మా వాడిని మన్నించే ధోరణులు జనసేనలో ఉండవని నాగబాబు స్పష్టంచేశారు. ప్రతి కార్యకర్తకు అవకాశాలు సమానంగా ఉంటాయని, పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తే ప్రజల మన్ననలు పొందగలుగుతారని ఆయన అన్నారు.