Site icon HashtagU Telugu

Janasena Formation Day : జగన్ ఇప్పటికే కలలు కంటూ ఉండాల్సిందే – నాగబాబు

Nagababu Speech Janasena

Nagababu Speech Janasena

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ (Janasena Formation Day) వేడుకలు పిఠాపురంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా జనసేన అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జనసేన నేత నాగబాబు (Nagababu) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో కార్యకర్తల త్యాగం అమూల్యం అని, జనసేన అధికారం లోకి వచ్చినప్పటికీ పార్టీ నేతలు సంయమనం పాటించాలని సూచించారు. జనసేన తత్వం ప్రజాసేవకే అంకితమని, పార్టీ శ్రేణులు ఏ విధంగానూ అహంకారం ప్రదర్శించకూడదని అన్నారు.

SLBC Tunnel Incident: ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ ఘ‌ట‌న‌.. సహాయక చర్యల పురోగతిపై సమీక్ష!

ఇదే సందర్బంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan)పై నాగబాబు విమర్శలు గుప్పించారు. “నోటి దురుసు ఉన్న నేతల పరిస్థితి ఏమిటో ఇప్పటికే చూశాం. జగన్ మోహన్ రెడ్డి లాంటి హాస్య నటుడు ఇకపై కలలు కంటూనే ఉండాలి. ఆయనకు మరో 20 ఏళ్లు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని” ఘాటుగా వ్యాఖ్యానించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో క్రమశిక్షణ కలిగిన నాయకుడని, 12 ఏళ్ల పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదని ప్రశంసించారు. పిఠాపురంలో ఘన విజయం సాధిస్తామని పవన్ ముందే ఊహించారని తెలిపారు.

జనసేన భవిష్యత్తుపై నాగబాబు ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. రాబోయే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం చూడబోతుందని, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని చెప్పారు. పదవులు వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్‌ కోసం సేవ చేయడం తమ బాధ్యత అని అన్నారు. ప్రజల బాగోగులను పట్టించుకునే నాయకుడు పవన్ అని, ఆయన అడగకుండానే ప్రజలకు మేలు చేసే గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. జనసేనకు కార్యకర్తలు, వీర మహిళలే అసలైన బలంగా నిలిచారని, పవన్‌లా గొప్ప నాయకుడవ్వాలని లేకపోతే ఆయన అనుచరుడిగా ఉండాలని నాగబాబు జనసేన శ్రేణులకు సూచించారు.