Site icon HashtagU Telugu

Nagababu: వైసీపీ నాయ‌కుల పాపాల‌కు.. 8 మంది అధికారులు బ‌లి..!

Nagababu Ysrcp

Nagababu Ysrcp

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు తాజాగా అధికార వైసీపీ ప్ర‌భుత్వం పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా కోర్టు ధిక్కరణ కేసులో ఆగ్రహానికి గురైన 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమ‌వుత‌న్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఇప్ప‌టికే తెలుగుదేశంపార్టీ అధికార వైసీపీ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ వ్య‌వ‌హారం పై ఇప్పుడు తాజాగా నాగబాబు కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు కోర్టు శిక్షకు గురయ్యారని తెలిసిందని, అయితే, ఇందులో అధికారుల పాత్ర ఏమీ ఉండదని నాగబాబు అన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గ్రామ సచివాలయాలు నిర్మించాలని అధికారులు తీర్మానించి ఉండరని నాగ‌బాబు అభిప్రాయపడ్డారు.అవన్నీ వైసీపీ ప్రజాప్రతినిధుల నిర్ణయాలే అయి ఉంటాయని నాగ‌బాబు అభిప్రాయపడ్డారు.

ఇక కోర్టు శిక్షకు గురైన 8 మంది ఐఏఎస్‌లు మంచి సమర్థులైన అధికారులేనని నాగ‌బాబు కితాబివ్వ‌డం విశేషం. వైసీపీ పాలనలో సమాజానికి, రాజ్యాంగానికి సంరక్షకులు గా ఉండాల్సిన అధికారులు, వైసీపీ నాయ‌కుల‌ మాయలో పడిపోయారని, వారంతా ఇప్పుడు వైసీపీ పెంపుడు జంతువులుగా మ‌రిపోయార‌ని, దీంతో వైసీపీ నాయ‌కులు చేస్తున్న పాపాల‌కు, అధికారులు బ‌ల‌వుతున్నార‌ని నాగ‌బాబు షాకింగ్ కామెంట్లు చేశారు. దీంతో ప్ర‌స్తుతం నాగబాబు చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఏపీ రాజకీయ వ‌ర్గాల్లో ర‌చ్చ లేపుతున్నాయి. మ‌రి నాగ‌బాబు కామెంట్స్ పై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version