Janasena : నాగబాబు జనసేన ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే . కూటమి నుంచి అయిదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. రేపు (సోమవారం) నామినేషన్లకు చివరి రోజు. అయితే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేయటంతో..మిగిలిన నలుగురు టీడీపీ నుంచి నామినేషన్లు వేయనున్నారు. వారి పేర్లను ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా, నాగబాబు తన ఎన్నికల అఫిడవిట్ తో తన ఆస్తులతో పాటుగా అప్పుల లెక్కలను వెల్లడించారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడుకు పవన్ కు చెల్లించాల్సిన అప్పుల గురించి వివరించారు.
Read Also: pradakshina : ఆలయాల్లో చేసే ప్రదక్షిణ అంటే ఏమిటి?.. ఎన్ని రకాలు తెలుసుకుందాం..!
చరాస్తుల వివరాలు..
.చేతిలో నగదు రూ.21.81 లక్షలు
.బ్యాంకులో నిల్వ రూ.23.53 లక్షలు
.ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.1.03 కోట్లు
.బెంజ్ కారు రూ.67.28 లక్షలు
.హ్యుందయ్ కారు రూ.11.04 లక్షలు
.మ్యూచువల్ ఫండ్స్/బాండ్లు రూ.55.37 కోట్లు
.రూ.18.10 లక్షల విలువైన 226 గ్రాముల బంగారం తనవద్ద, తన భార్యవద్ద రూ.16.50 లక్షల .విలువైన 55 క్యారట్ల వజ్రాలు, రూ.57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, రూ.21.40 లక్షల .విలువైన 20 కేజీల వెండి ఉన్నట్లు తెలిపారు.
.తనకు, తన భార్యకు కలిపి చరాస్తులు మొత్తం రూ.59.12 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు.
స్థిరాస్తుల వివరాలు..
.హైదరాబాద్‌లోని మణికొండలో రూ.2.88 కోట్ల విలువైన 460 చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా
.రంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరుచోట్ల ఉన్న 2.39 ఎకరాల భూమి విలువ రూ.3.55 కోట్లు
.మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రూ.32.80 లక్షల విలువైన 3.28 ఎకరాలు, అదే ప్రాంతంలో మరో .సర్వే నంబరులో రూ.50 లక్షల విలువైన 5 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో రూ.53.50 .లక్షల విలువైన 1.07 ఎకరాల భూములు
.మొత్తంగా రూ.11.20 కోట్ల విలువైన స్థిరాస్తులు
అప్పుల వివరాలు..
.తన అన్న చిరంజీవి నుంచి రూ.28,48,871, తమ్ముడు పవన్ కల్యాణ్ నుంచి రూ.6.90 లక్షలు అప్పు తీసుకున్నట్లు వెల్లడించారు.
.రెండు బ్యాంకుల్లో గృహరుణ మొత్తం రూ.56.97 లక్షలు, కారు రుణం రూ.7,54,895. ఇవికాకుండా ఇతర వ్యక్తులు, సంస్థల నుంచి తీసుకున్నవన్నీ కలిపి రూ.1.64 కోట్ల అప్పులున్నాయని తెలిపారు.
Read Also: Bird Flu Outbreak : వేలాది కోళ్ల మృత్యువాత.. తెలంగాణలో బర్డ్ ఫ్లూ కొనసాగుతోందా ?