TDP-Janasena : నాగబాబు మరింత మంట పెడుతున్నాడా..?

  • Written By:
  • Publish Date - January 27, 2024 / 02:21 PM IST

ఏపీలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు..ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించలేదు..ఇంతలోనే జనసేన – టీడీపీ (Janasena – TDP) కూటమి లో కొత్త లొల్లి మొదలైంది. గత ఎన్నికల్లో ఎవరికీ వారు సింగిల్ గా బరిలో నిల్చువడం వల్ల వైసీపీ (YCP) కి మేలు జరిగిందని..ఈసారి ఆలా కాకుండా ఉండాలంటే కలిసి బరిలోకి దిగాలని డిసైడ్ అయినా జనసేన – టీడీపీ..ఆ మేరకు పొత్తు ఫిక్స్ చేసుకున్నాయి. అన్ని పొత్తుల్లోనే ముందుకు సాగాలని అనుకున్నారు. కానీ బాబు తొందరపడి అరకు , మండపేట స్థానాలను ప్రకటించేసరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఎక్కడో కాలింది. అసలే తిక్క..ఇక ఊరుకుంటాడా..నేను ఏమైనా తక్కువ అన్నట్లు నిన్న రాజోలు , రాజానగరం స్థానాల్లో జనసేన బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించేశాడు. ఇదే సందర్బంగా చంద్రబాబు ఫై కాస్త అసహనం కూడా వ్యక్తం చేసాడు. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించటం లేదని పవన్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలను వైసీపీ క్యాష్ చేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇంకేముంది చేతిలో ఉన్న మీడియా లో కూటమి బద్దలు కాబోతుందని , ఎన్నికలు రాకముందే కూటమి లో గొడవలు తారాస్థాయికి చేరాయని , పవన్ – బాబు లు దూరం కాబోతున్నారని , ఎన్నికల్లో ఎవరికీ వారు తమ అభ్యర్థులను నిలబెట్టబోతున్నారని ప్రచారం మొదలుపెట్టారు. దీంతో పవన్ తో పాటు టీడీపీ క్యాడర్ అలర్ట్ అయ్యింది. పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పార్టీ నేతలు చెప్పడం మొదలుపెట్టారు… పవన్ రెండు సీట్లు ప్రకటించడం వల్ల తమకు ఇబ్బంది లేదని, ఏదైనా ఉంటే చంద్రబాబు-పవన్ కూర్చుని మాట్లాడుకుంటారని చెప్పుకొచ్చారు. దీంతో అంత ఈ వ్యవహారం ఇక్కడితో సద్దుమణుగుతుందిలే అని భావిస్తుండగా..మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ఈ గొడవకు మరింత మంట పుట్టించారు.

చర్యకు ప్రతి చర్య ఉంటుందని న్యూటన్ సిద్ధాంతాన్ని ఆయన ఉటంకించారు. అయితే ఈ ట్వీట్ టీడీపీని ఉద్దేశించి చేసిందేనని సోషల్ మీడియాలో కామెంట్స్ వేయడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో మరో ట్వీట్ చేసాడు నాగబాబు. నేను పెట్టే ప్రతీ పోస్ట్ కి ఏదోక అర్ధం వుంటది అనుకోవద్దు కొన్ని సార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటాను,ఇవ్వాల Physics laws యే చేసాను రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తాను… Note 🙁 వీటి గురించి ఆలోచించి గుమ్మడి కాయల దొంగలు అవ్వొద్దు) అంటూ ట్వీట్ చేసారు. దీంతో మరిన్ని ట్వీట్లకు నాగబాబు సిద్దంగా ఉన్నారనే విషయం స్పష్టం అవుతోంది. ఏది ఏమైనప్పటికి ఏ విషయమైనా బయటకు రాకుండా లోలోపలే చూసుకోవాలని..బయటకు వస్తే ప్రత్యర్థి పార్టీ కి ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

Read Also : Sharmila : వైఎస్ కట్టిన ప్రాజెక్ట్ మెయింటెన్స్ కూడా చేయని మీరు వారసుడు ఎలా అవుతారు?: షర్మిల