Nagababu : ప్రతి ఆంధ్రుడి తరఫున మీసం తిప్పుతున్నా – నాగబాబు

'ఈ మీసం తిప్పింది.. జనసేనాని 100% స్ట్రైక్తేట్తో గెలిచారని కాదు. కూటమి అఖండ విజయం సాధించిందని కూడా కాదు. ఈ ధర్మపోరాటంలో పోరాడి గెలిచిన ప్రతి ఆంధ్రుడి తరఫున నేను గర్వంతో తిప్పుతున్నా'

Published By: HashtagU Telugu Desk
Nagababu Meesam

Nagababu Meesam

పదేళ్ల పవన్ కళ్యాణ్ 0(Janasena) పోరాటానికి ప్రతిఫలం దక్కింది. ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టించింది. గత ఎన్నికల్లో ఒకే ఒక స్థానంలో విజయం సాధించిన జనసేన..ఇప్పుడు పోటీ చేసిన 21 అసెంబ్లీ , 2 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించి గ్లాస్ దెబ్బ ఇలా ఉంటుందని రుచి చూపించింది. జనసేన భారీ విజయం సాధించడం , పిఠాపురం లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ తో విజయం సాధించడం తో జనసేన శ్రేణులంతా పాటు మెగా అభిమానులు , సినీ ప్రముఖులు సంబరాలు చేసుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో జనసేన నేత నాగబాబు (Nagababu) మీసం తిప్పారు. ‘ఈ మీసం తిప్పింది.. జనసేనాని 100% స్ట్రైక్తేట్తో గెలిచారని కాదు. కూటమి అఖండ విజయం సాధించిందని కూడా కాదు. ఈ ధర్మపోరాటంలో పోరాడి గెలిచిన ప్రతి ఆంధ్రుడి తరఫున నేను గర్వంతో తిప్పుతున్నా’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి మీసం తిప్పుతున్న ఫొటోను జతచేశారు. ఈ ఫోటో ను జనసేన శ్రేణులు తెగ షేర్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటె ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయగా, పార్టీ గెలుపు కోసం నటుడు, జనసేన నేత నాగబాబు కూడా కృషి చేశారు. ఇందుకు గాను ఆయనకు టిటిడి చెర్మన్ పదవి అప్పగిస్తున్నట్లు వార్తలు వైరల్ కావడం తో వాటిపై క్లారిటీ ఇచ్చారు. తాను టీటీడీ చైర్మన్‌ పదవీని ఆశిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన ఖండించారు. నాకు ఏ పదవి మీద ఆశ లేదు.. నేను ఏ పదవి ఆశించడం లేదని ప్రకటించారు. అలాగే నేను ఉన్నత వరకు జన సేన పార్టీకి అండగా ఉంటానని స్పష్టం చేశారు.

Read Also ; Deepika Padukone : వేర్ ఈజ్ దీపికా.. కల్కిలో ఆమె ఉందా లేదా..?

  Last Updated: 07 Jun 2024, 07:25 PM IST