Site icon HashtagU Telugu

Nagababu : వైసీపీ మంత్రులంతా హాఫ్ బ్రెయిన్ మంత్రులేనట..నాగబాబు హాట్ కామెంట్స్

Nagababu New Vote Ap

Nagababu New Vote Ap

వైసీపీ మంత్రులంతా హాఫ్ బ్రెయిన్ (All YCP Ministers Are Half Brain)) మంత్రులంటూ జనసేన నేత నాగబాబు (Nagababu) హాట్ కామెంట్స్ చేసారు. నెల్లూరు (Nellore) జిల్లాలో రెండు రోజుల పర్యటనకోసం వచ్చిన ఆయన.. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో మాట్లాడారు. సమన్వయంతో ముందుకు కదలాలని, జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వారికి పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో జనసేన గ్రాఫ్ బాగా పెరిగిందని , ముఖ్యంగా గోదావరి జిల్లాలో 40 శాతం పెరిగిందని నాగబాబు చెప్పుకొచ్చారు. వైసీపీ కి 25 సీట్లు రావడం గొప్పే అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ కూటమి 150 సీట్లలో విజయం సాదించబోతుందని ధీమా వ్యక్తం చేసారు. అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం సంక్షేమ పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు ఖాళీ చేసిందని.. ఆ ఖాళీని భర్తీ చేయాలంటే కనీసం దశాబ్దాల కాలం పడుతుందని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దేవాలయంలాంటి శాసన సభలో బూతులు మాట్లాడటం, స్టేజ్ మీద డ్యాన్స్ లు వేయడం తప్ప వైసీపీ నాయకులకు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని తామెక్కడా చూడలేదన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు సజ్జల స్క్రిప్ట్ ఇస్తే.. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతల్ని తిడుతున్నారని మండిపడ్డారు. పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం ఆదేశాలతోనే తాము అలా చేస్తున్నట్టు వారే ఒప్పుకున్నారని నాగబాబు చెప్పుకొచ్చారు. నెల్లూరు కు చెందిన ఓ నేత గతంలో పోలవరాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామన్నారని, తొందరెందుకంటూ వ్యంగ్యంగా మాట్లాడారని, ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే నిరుద్యోగం ఏర్పడిందని, కానీ ఎక్కువమంది చదువుకోవడం వల్ల నిరుద్యోగం అంటూ వైసీపీ నేతలు కొత్త భాష్యం చెబుతున్నారని కౌంటర్ ఇచ్చారు నాగబాబు.

Read Also : Ola: ఓలా స్కూటర్ పై కళ్ళు చెదిరే ఆఫర్స్.. ఏకంగా అన్ని వేల రూ. తగ్గింపు?