Site icon HashtagU Telugu

Nagababu Clarity on Vote : ఓటు వివాదం ఫై నాగబాబు క్లారిటీ

Nagababu Vote

Nagababu Vote

జనసేన నేత నాగబాబు (Nagababu) తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు (Vote) కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకోవడం ఫై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన నాగబాబు..మళ్లీ ఏపీలో ఓటు హక్కు కోసం దరకాస్తు చేసుకోవడం ఏంటి అని వైసీపీ (YCP) సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలో నాగబాబు క్లారిటీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇదే క్రమంలో చాలామంది ప్రజలు , యువత , నేతలు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలుపెట్టారు. తాజాగా జనసేన నేత నాగబాబు తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకోవడం ఫై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు మొదలుపెట్టింది.

ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో నాగబాబు ఫ్యామిలీ ఓటు వేసిందని .. పోలింగ్ బూత్ 168లో కొణిదెల నాగబాబు (సీరియల్‌ నెంబర్‌- 323), కొణిదెల పద్మజ (సీరియల్‌నెంబర్‌- 324), వరుణ్ తేజ్ (సీరియల్ నెంబర్ – 325) ఓటు హక్కు వినియోగించుకున్నారని.. ఇప్పుడు ఏపీలో కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావుగా ఓటు వేసిన నాగబాబు..ఇప్పుడు ఏపీ లోనాగేంద్రబాబుగా మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని కొన్ని ఆధారాలను ఆ పార్టీ పోస్ట్ చేసింది. దీంతో దీనిపై అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

దీనిపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు. అంతేగాక ఎన్నికల వ్యవస్థపై తనకు గౌరవం ఉందని , అధికార పార్టీకి చెందిన కొందరు దీనిని వివాదం చేస్తున్నారన్నారు. హైదరాబాదులో ఉన్న నా ఓటును రద్దు చేసుకున్నానని తెలిపిన నాగబాబు.. దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. తన ఓటును ఆంధ్రప్రదేశ్‌కు మార్చుకొని జనసేన.. టీడీపీకి మద్దతుగా నిలుస్తామన్నారు.

Read Also : PDF MLC Shaik Sabji : అధికారిక లాంఛనాలతో ముగిసిన ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అంత్యక్రియలు