Site icon HashtagU Telugu

Jagan : జగన్ వ్యాఖ్యలపై నాగబాబు సెటైర్లు

Jagan Pennelli

Jagan Pennelli

పిన్నెల్లికి కోపమొచ్చి EVM పగులగొట్టారన్న జగన్ వ్యాఖ్యలపై జనసేన నేత నాగబాబు (Nagababu) సెటైర్లు వేశారు. ‘ఏం మాట్లాడుతున్నారండి బాబు..? పోలింగ్ కేంద్రంలో నిజంగా అన్యాయం జరిగితే అక్కడ పోలీసులు, ఎన్నికల సిబ్బంది లేరా..? మిడిమిడి జ్ఞానంతో మితిమీరిన ఎచ్చులకి పోయినందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇకనైనా పరిణతితో మాట్లాడకపోతే ఈసారి సింగిల్ డిజిట్ కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని జనసేన నేత నాగబాబు ట్వీట్ చేసారు.

అంతకు ముందు ఏంజరిగిందంటే..

ఈవీఎం పగులగొట్టిన కేసుతో పాటు పలు కేసుల్లో ఆరోపణలు ఎదురుకుంటున్న మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ..poling లో రిగ్గింగ్‌ను అడ్డుకునే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేస్తే, హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టారు. నిజంగా అటువంటిది జరిగి ఉంటే సిట్‌ 17వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో ఇచ్చిన రిపోర్టులో చెప్పాలి కదా. 2009 నుంచి వరుసగా నాలుగుసార్లు పిన్నెల్లి గెలిచాడంటే మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంత వరకు ధర్మం? ఈరోజు ఒక్క రామకృష్ణారెడ్డి ఒక్కడి పరిస్థితే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఇదే కార్యక్రమాలు జరుగుతున్నాయి” అని జగన్ అన్నారు.

ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలతో పాటు జనసేన నేతలు జగన్ కు కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. పిన్నెల్లిని కలిసిన జగన్..ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. వెళ్లిన పని చేసుకొని రావాలని గానీ.. ప్రభుత్వం విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. అసలు పిన్నెల్లిని కలిసేందుకు ములాఖత్‌కు అవకాశం లేకపోయినా మాజీ సీఎం కదా అని అనుమతిచ్చామన్నారు. కానీ జైలు వద్ద సీఎం చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. గత ఐదేళ్లు అధికారాన్ని అడ్డుకుని కేసుల నుంచి తప్పించుకున్న జగన్.. త్వరలో జైలు వెళతాడని హెచ్చరించారు. తాము అధికారంలోకి 21 రోజులే అవుతుందని.. ఇంతలోనే ప్రభుత్వం ఏమీ చేయలేదనే మాటలు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు.

Read Also :  Pooja Tips: దేవుడికి పూజ చేస్తున్నారా.. అయితే ఈ నియమాలు తప్పకుండా పాటించాల్సిందే!

Exit mobile version