Site icon HashtagU Telugu

Akhil Wedding : అఖిల్ పెళ్లికి రండి..చంద్రబాబు కు నాగ్ ఆహ్వానం

Akhil Wedding Cbn

Akhil Wedding Cbn

అక్కినేని ఇంట పెళ్లి పనులు ఘనంగా సాగుతున్నాయి. ఏఎన్నాఆర్ మనవడు, కింగ్ నాగార్జున రెండో కుమారుడు అఖిల్ వివాహ (Akhil Wedding) సందడి వేడుక అంబరాన్ని తాకేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు స్వయంగా నాగార్జున (Nagarjuna) వెళ్లి పెళ్లి కార్డులు అందజేస్తూ పెళ్ళికి రావాలని కోరుతున్నారు.

తాజాగా.. ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు నాగార్జున వెళ్లి స్వయంగా వివాహ పత్రిక అందజేశారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసిన ఆయన తన చిన్న కుమారుడు అఖిల్ వివాహానికి హాజరు కావాల్సిందిగా చంద్రబాబును కోరారు. ఈ మేరకు వివాహ పత్రికను అందించారు. కాసేపు ఇరువురూ ముచ్చటించారు.

XChat: వాట్సాప్‌కు పోటీగా ఎక్స్‌ చాట్‌..ఫీచర్స్‌ ఇవే..!

అంతకు ముందే నాగార్జున, అమల దంపతులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తప్పకుండా అఖిల్ వివాహానికి రావాలని కోరారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ నెల 6న అఖిల్, జైనాబ్‌ల వివాహం జరగనుంది. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వేడుక ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. జైనాబ్.. ప్రముఖ వ్యాపారవేత్త జూల్ఫీ రావ్‌జీ కుమార్తె. గతేడాది నవంబరులో వీరి నిశ్చితార్థం జరిగింది.

కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఎంగేజ్మెంట్ తర్వాత తనకు కాబోయే భార్యతో పలుమార్లు అఖిల్ జంటగా కనిపించారు. పెళ్లి తర్వాత రిసెప్షన్ రాజస్థాన్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి కొద్ది మంది ప్రముఖులు, అతిథుల సమక్షంలో చేసుకుని రిసెప్షన్‌కు అందరినీ ఆహ్వానించనున్నట్లు సమాచారం.