ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) రోజు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR)అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan), జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan)పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై జనసేన పార్టీ తీవ్రంగా మండిపడుతోంది.
Telangana Culture: హాస్తినలో విరిసిన తెలంగాణ సంస్కృతి శోభ
ఇక ప్రతిపక్ష హోదా అంశంపై కూడా రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన “ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్లాలి” అన్న వ్యాఖ్యలపై జగన్ వ్యంగ్యంగా స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను కేవలం కార్పొరేటర్ స్థాయికి తక్కువగా చూపిస్తూ, జీవితంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తనపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
Ropeway: యాత్రికులకు గుడ్ న్యూస్.. 9 గంటల ప్రయాణం ఇకపై 36 నిమిషాలే!
దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, తాము కూడా “కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ” అనగలమని, అయితే తమకు సభ్యత ఉందని ఘాటుగా స్పందించారు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా బెంగళూరులోనే ఉంటాడని , అసెంబ్లీ పూర్తయిన వెంటనే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోకి వెళ్లి ప్రజాసమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారని, కానీ జగన్ మాత్రం ప్రజలకు దూరంగా ఉంటున్నారని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని జగన్ వ్యాఖ్యలు చేయడాన్ని రాజకీయ స్వార్థంతో కూడుకున్న చర్యగా అభివర్ణించారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.