Yuvagalam Navasakam: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ -జనసేన ఏకమయ్యాయి. జగన్ ని ఇంటికి పంపించేందుకు ఇరు పార్టీలు కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నాయి. ఇరు పార్టీలు ఒకే నినాదంతో ముందుకెళ్తుండగా నారా లోకేష్ రాజకీయాలను పక్కనపెట్టి యువగలం పేరుతో పాదయాత్ర చేశారు. 226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. పాదయాత్రలో మొత్తం 3,132 కిలోమీటర్లు నడిచారు. ఈ రోజుతో పాదయాత్ర ముగియడంతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాలయ్య, లోకేష్ హాజరయ్యారు. పదేళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ ఒకే వేదికపై కనిపించడంతో టీడీపీ, జనసేన శ్రేణులు సంబరపడిపోయారు.
యువగళం విజయోత్సవ సభలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను ప్రస్తావించారు. జనసేన-టీడీపీ కలయికతో కొత్త శకం మొదలవబోతుందని చెప్పిన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల చెప్పారు. 2014లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపించారని చెప్పారు. అయితే ఒక్క అవకాశం పేరుతో జగన్ 2019లో అధికారం చేపట్టి రాష్ట్ర భవితవ్యాన్ని వెనక్కి నెట్టారని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత జగన్ చేసిన నష్టాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఒక్క అవకాశం ఇవ్వడం ద్వారా నష్టం ఏ మేర జరిగిందో అర్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
యువగలం నవశకం బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు తండోపతండాలుగా హాజరయ్యారు. ఈ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 110 ఎకరాల స్థలంలో 6 లక్షల మందితో సభ దద్దరిల్లింది. అందరూ చూసే విధంగా 50 అడుగుల డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు.
Also Read: Driving Tips : కొత్త బైక్ ని వేగంగా నడుపుతున్నారా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..