Nadendla Manohar : అవినీతే లేదంటూ జగన్ చెప్పడం పచ్చి అబద్దం

ఓ ఐఏఎస్ అధికారికి ఓ మంత్రి రూ. 100 కోట్లు ఆఫర్ చేశారంటూ నాదెండ్ల సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఇవాళ జనసేన (Janasena) పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మీడియాతో మాట్లాడుతూ.. 130 సార్లు బటన్ నొక్కినా ఒక్క పైసా- అవినీతే లేదని జగన్ తనకు తానే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారని నాదెండ్ల సంచలన ఆరోపణలు గుప్పించారు.

Published By: HashtagU Telugu Desk
Nadendla Manohar

Nadendla Manohar

ఓ ఐఏఎస్ అధికారికి ఓ మంత్రి రూ. 100 కోట్లు ఆఫర్ చేశారంటూ నాదెండ్ల సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఇవాళ జనసేన (Janasena) పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మీడియాతో మాట్లాడుతూ.. 130 సార్లు బటన్ నొక్కినా ఒక్క పైసా- అవినీతే లేదని జగన్ తనకు తానే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారని నాదెండ్ల సంచలన ఆరోపణలు గుప్పించారు. అవినీతే లేదంటూ జగన్ (YS Jagan Mohan Reddy) చెప్పడం పచ్చి అబద్దమని ఆయన పేర్కొన్నారు. మేమే చాలా సందర్భాల్లో ఆధారాలతో సహా అవినీతిని వెలుగులోకి తెచ్చామని, మేం ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే మాపై వ్యక్తిగత దాడి చేసేవారని ఆయన అన్నారు. అవినీతిపై చర్యలు తీసుకోవడానికి 14400 నెంబర్ ఏర్పాటు చేశారని, 14400 నెంబరుకు 8,03,612 మేర అవినీతి జరుగుతోందంటూ కంప్లైంట్లు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులు, వారి పేషీలపై 2,16,803 కంప్లైంట్లు వచ్చాయని, వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులపై 4,39,679 కంప్లైంట్లు వచ్చాయన్నారు నాదెండ్ల మనోహర్‌.

We’re now on WhatsApp. Click to Join.

ఇన్ని లక్షల కంప్లైంట్లు వస్తే ఒక్క ఫిర్యాదు పైనా చర్యల్లేవని, ఏసీబీ ప్రతేడాది ఏసీబీ తీసుకున్న చర్యలపై నివేదికలు ఇవ్వడం ఆనవాయితీ అని నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. కానీ జగన్ సీఎం అయ్యాక ఏసీబీ ఈ తరహా నివేదికలే లేవని, చిన్న చిన్న ఉద్యోగులపై కక్షతో వ్యవహరిస్తున్నారన్నారు. ఇదేకాకుండా.. ఏసీబీ చీఫ్ ఎవరని స్వయంగా సీఎం ఓ సమీక్షలో అడిగిన విషయాన్ని నాదెండ్ల మనోహర్‌ గుర్తు చేశారు. ప్రస్తుత డీజీపీనే ఏసీబీ చీఫ్ అనే విషయం కూడా జగనుకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని, టీచర్ల బదిలీల్లో వందల కోట్ల మేర చేసిన అవినీతికి లెక్క లేదని ఆయన ధ్వజమెత్తారు.

ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి ఓ మంత్రి రూ. 100 కోట్లు ఆఫర్ ఇచ్చారని, ఈఈ ట్రాన్సఫర్లల్లో ఓ మంత్రి రూ. 15 లక్షలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. మంత్రుల అవినీతి చూసి యాక్షన్ తీసుకోమని అధికారులు సీఎంకు ఫైల్ పెట్టినా జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. ఏ శాఖ చూసినా అవినీతే అని, పాలవెల్లువలో, ఆర్బీకేల్లో, నాడు-నేడులో విద్యా శాఖలో ఇలా ప్రతి శాఖలోనూ అవినీతే అని ఆయన నాదెండ్ల మండిపడ్డారు.
Read Also : RRR : టిక్కెట్‌పై రఘురామకృష్ణంరాజుకు విశ్వాసం ఏంటి.?

  Last Updated: 29 Mar 2024, 05:03 PM IST