Site icon HashtagU Telugu

Chandrababu: మ‌ళ్లీ ఢిల్లీకి చంద్ర‌బాబు!మోడీ స‌భ‌కు ఆహ్వానం!!

Modi option

Chandrababu naidu modi

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఢిల్లీ నుంచి మ‌ళ్లీ పిలుపు వ‌చ్చింది. మరోసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నిర్వ‌హించే స‌మావేశానికి హాజ‌రు కావ‌డానికి చంద్ర‌బాబు సిద్ధం అయ్యారు. డిసెంబ‌ర్ 5వ తేదీ జ‌రిగే స‌మావేశానికి హాజ‌రు కానున్నార‌ని పార్టీ వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం. దేశ వ్యాప్తంగా ఉన్న రాజ‌కీయ పార్టీల చీఫ్ ల‌తో మోడీ భేటీ అవుతున్నారు. ఆ క్ర‌మంలో చంద్ర‌బాబుకు ఆహ్వానం ల‌భించింది.

భారత్‌లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సదస్సు ఎజెండా ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఆ సదస్సుకు సంబంధించి సూచనలు, అభిప్రాయాలను వివిధ రాజ‌కీయ పార్టీ అధ్య‌క్షుల నుంచి తీసుకోవాల‌ని కేంద్రం భావించింది. రాష్ట్రపతి భవన్‌లో డిసెంబ‌ర్ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఆ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆయా పార్టీల చీఫ్ ల‌కు ఫోన్లు చేసి ఆహ్వానించారు. కేంద్రం ఆహ్వానం మేరకు మరొకసారి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

Also Read:  AP Land Survey : భూ హ‌క్కు ప‌త్రాల్లో జ‌గ‌న్ సోకు

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశానికి చంద్ర‌బాబును ఇటీవ‌ల కేంద్రం ఆహ్వానించింది. అప్పుడు కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతోపాటు ప్రముఖ రాజకీయ నేతలు, క్రీడాకారులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులకు కేంద్రం ఆహ్వానాల‌ను పంపింది.ఆ సమావేశం త‌రువాత‌ ప్రధాని నరేంద్ర మోదీ ,చంద్రబాబు 5 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడుకోవ‌డం తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం అయింది.

అంతేకాదు, భీమ‌వ‌రం కేంద్రంగా ఈ ఏడాది జులై 4న జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌కు టీడీపీకి ఆహ్వానం ల‌భించింది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. పార్టీ నుంచి ప్రతినిధిని పంపాలని లేఖ‌లో కోరారు. టీడీపీ తరపున అచ్చెన్నాయుడు ఆ కార్య‌క్ర‌మానికి వెళ్లిన‌ప్ప‌టికీ ప్రొటోకాల్ ప్ర‌కారం రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించ‌లేదు. మెగాస్టార్ చిరంజీవికి పెద్ద‌పీఠ వేస్తూ ఆ రోజున జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ చేసిన ప్ర‌య‌త్నం ప‌లు రాజ‌కీయ చ‌ర్చ‌ల‌కు దారితీసింది. తాజాగా డిసెంబ‌ర్ 5న జ‌రిగే మోడీ స‌మావేశానికి హాజరుకావాల‌ని చంద్ర‌బాబుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం వ‌చ్చింద‌ని తెలియ‌గానే రాజ‌కీయ ఈక్వేష‌న్లు మ‌ళ్లీ తెర‌మీద‌కు రావ‌డం సాధార‌ణ‌మే.

Also Read:  CM JAGAN : తెలుగు బూతుల పార్టీ చీఫ్ లో ఆ భయం కనిపిస్తోంది: ఏపీ సీఎం జగన్..!!