Mystery Box – Vizag Beach : చూడటానికి చాలా పాతదిగా కనిపిస్తున్న భారీ చెక్క పెట్టె అది. ఈ మిస్టరీ వుడ్ బాక్స్ విశాఖపట్నంలోని వైఎంసీఏ బీచ్ తీరానికి కొట్టుకొని వచ్చింది. శుక్రవారం రాత్రి కొందరు టూరిస్టులు ఈ పెట్టెను గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పురాతనమైన పెట్టె కావడంతో ప్రొక్లెనర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. దీని గురించి ఆర్కియాలజీ విభాగానికి పోలీసులు సమాచారం అందించారు. బీచ్‌లో ఈ పెట్టెను చూసేందుకు అక్కడే ఉన్న సందర్శకులు పోటీపడ్డారు. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఇబ్బందిపడ్డారు. దాదాపు 100 టన్నుల బరువున్న ఈ పెట్టెలో ఏమున్నాయి ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అది బ్రిటీష్ కాలం నాటి బాక్స్ అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గతంలోనూ విశాఖ తీరానికి ఈవిధంగా పురాతన వస్తువులు కొట్టుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి.
Also read : Bharat Dal – October 1st : రూ.60కే కిలో శనగపప్పు.. అక్టోబరు 1 నుంచి ‘భారత్ దాల్’ సేల్స్
గతంలో విశాఖలోని ఆర్కే బీచ్ లో బ్రిటీష్ కాలం నాటి బంకర్లు బయటపడ్డాయి. ఆ బంకర్లను రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించారని తేలింది. కాలక్రమంలో సముద్రపు అలల తాకిడికి ఆ బంకర్లు ఇసుకలో కూరుకుపోయాయని వెల్లడైంది. జాలరి పేట వద్ద మాత్రం ఒక బంకర్ శిథిల స్థితిలో ఇప్పటికీ ఉంది. వైజాగ్ లోని పాండురంగ స్వామి ఆలయం సమీపంలో కూడా ఒక బంకర్ బయటపడింది. రాతి యుగంలో కూడా విశాఖలో మానవ నాగరికత ఉన్నట్టు చరిత్రకారులు చెబుతుంటారు. తాజాగా లభ్యమైన మిస్టరీ వుడ్ బాక్స్ బ్రిటీష్ కాలం నాటిదా ? రాతియుగం నాటిదా ? (Mystery Box – Vizag Beach) తేలాల్సి ఉంది.