Rajinikanth: నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు: సూపర్ స్టార్ రజనీకాంత్

తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై సౌత్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు.

Published By: HashtagU Telugu Desk
Rajinikanth

Rajinikanth

చంద్రబాబు అరెస్ట్ వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు టీడీపీ అధినేతకు మద్దతు పలికారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు చంద్రబాబును కలుసుకోబోతున్న విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై సౌత్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. ఈ మేరకు చంద్రబాబు కొడుకు నారా లోకేష్‌కు తలైవా ఇవాళ ఫోన్ చేశారు. అక్రమ కేసులు చంద్రబాబును ఏమీ చేయలేవని.. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలని.. కుటుంబం జాగ్రత్త అని రజినీకాంత్ నారా లోకేష్‌కు సూచించారు.

నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడన్నారు. చంద్రబాబు చేసిన సంక్షేమం, అభివృద్ధే ఆయనకు రక్ష అని అన్నారు. ఇలాంటి ఎన్ని అక్రమ కేసులు ఎన్ని అయిన బాబును ఏమీ చేయలేవని లోకేష్‌కు భరోసా ఇచ్చారు. కాగా నందమూరి కుటుంబానికి రజినీ కి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అభిమానంతోనే రజినీ.. ఈ మధ్య జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొని చంద్రబాబు పాలన గురించి సూపర్ స్టార్ మెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ వాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినప్పటికీ తాజాగా రజనీకాంత్ చంద్రబాబుకు మద్దతు ప్రకటించడం గమనార్హం.

Also Read: Mrunal Thakur video: పాపం మృణాల్ ఠాకూర్, తెలుగు నేర్చుకోవడానికి ఎన్ని కష్టాలో పడుతుందో చూడండి!

  Last Updated: 13 Sep 2023, 04:21 PM IST