Anakapalle MVR : ‘ఎంవీఆర్’ వెంటే మా అడుగు అంటున్న అనకాపల్లి ఓటర్లు..

  • Written By:
  • Updated On - March 13, 2024 / 06:27 PM IST

ఏపీ రాజకీయాల్లో ( AP politics) పెను సంచలనంగా మారారు..ప్రముఖ వ్యాపారవేత్త, ఎంవీఆర్ (MVR) గ్రూపుల అధినేత ఎంవీఆర్ (ముత్యాల వెంకటరావు). గత రెండు దశబ్దాలుగా అనకాపల్లి (Anakapalle ) జిల్లా వ్యాప్తంగా తన సేవ కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయిన MVR . ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి..రాజకీయాలతో ప్రజలకు మరింత సేవ చేసేందుకు సిద్ధమయ్యారు.

MVR అంటే కేవలం అనకాపల్లి జిల్లాలోనే కాదు.. తెలంగాణ , కర్ణాటక , కేరళ వంటి రాష్ట్రాలలో కూడా ఈయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అనకాపల్లి టు ఢిల్లీ వరకు ప్రముఖులతో ఈయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రముఖ వ్యాపారవేత్తగా ఈయన గత నాలుగు దశాబ్దాలుగా టెక్స్టైల్స్ రంగంలో దూసుకుపోతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఏ ఒక్కరు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదని భావించినటువంటి ఈయన ఎన్నో కంపెనీలను వ్యాపారాలను ప్రారంభించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు..కల్పిస్తూనే ఉన్నారు. ఇక మండలాలలో ఏ ఒక్కరికి సహాయం అవసరమైన నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ వస్తున్నారు. పెద్ద ఎత్తున హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి వారందరి ఆరోగ్య బాధ్యతలను తీసుకున్నారు. ఇలా అందరికీ తలలో నాలుకలా ఉన్నటువంటి MVR ఎన్నికల బరిలోకి దిగితే గెలుపు ఖాయం.

ఎన్నికల సమయంలో చాలా మంది రాజకీయ నేతలు టికెట్ల కోసం పార్టీల చుట్టూ తిరుగుతుంటారు. ప్రజాసేవ చేసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. తమకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిచి చూపిస్తామని పార్టీ అధినేతలకు చెప్తుంటారు. ఇప్పుడు అనకాపల్లిలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ముత్యాల వెంకటేశ్వర రావు (ఎంవీఆర్) రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సిద్దమయ్యారనే వార్తలు బయటకు రాగానే.. ప్రధాన పార్టీలు ఈయన్ను చేర్చుకునేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో పలు పార్టీలు ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని కోరాయి. కానీ ఎంవీఆర్ అంగీకరించలేదు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని తెలియగానే ఆయన రాకను టీడీపీ , వైసీపీ తో పాటు మిగతా పార్టీలు కూడా స్వాగతిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

దీని వెనుక చాల కారణాలే ఉన్నాయి. మొదటిది ఆయన ఆర్థికంగా బలంగా ఉండటం.. రెండోది ఆయన చేసే సేవా కార్యక్రమాలు.. ఎంవీఆర్ యువసేన పేరుతో ఏకంగా ఒక సేవా సామ్రాజ్యాన్నే నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా కచ్చితంగా ఎంవీఆర్ అక్కడ ఉంటాడు. కొత్త ఆలయాలు కట్టించడం..ఉత్సవాలకు దన్నుగా నిలవడం.. పాడుపడిన ఆలయాల్ని పునర్నిర్మించడం.. అంతే కాదు ఆరు నెలలపాటు దీక్షలోనే ఉండడం.. ఏడాది పొడవునా దైవిక కార్యక్రమాలు చేపడుతుండడం.. రూపాయికే పేదవాడికి భోజనం అందించడం, అనకాపల్లి జిల్లా మొత్తం ఊరూరా మెడికల్ క్యాంపులు నిర్వహించడంలాంటి ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు ఎంవీఆర్ యువసేన ద్వారా విస్తృతంగా చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో నిరుద్యోగ యువత అంటూ ఉండకూడదని తన వంతుగా 5 వేల మందికి ఉద్యోగాలు కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. వారికి శిక్షణ ఇప్పించి మరీ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎటు చూసిన MVR కు కలిసొచ్చే అంశాలే ఉండడం తో ఈయన్ను ఏ పార్టీ వదులుకునేందుకు ఇష్ట పడడం లేదు. ఆయన ఏ పదవి కోరిన ఇచ్చేందుకు సై అంటున్నారు.

అనకాపల్లి పార్లమెంటు పరధిలో కాపు సామాజిక వర్గం ఎక్కువ. ఆ తర్వాత యాదవులదే ఆధిపత్యం. అందుకే ఇక్కడ కాపు సామాజిక వర్గ నేతలు బరిలో ఉండేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో ఎంవీఆర్ ను పోటీ చేయాలని పలువురు కోరుతున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీలను కూడా గెలిపించుకోగల సత్తా ఉందని చెప్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తన వ్యాపారాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఉండడం ఎంవీఆర్ కు కలిసొచ్చే అంశం. వ్యాపారవేత్తగా రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఎంవీఆర్ కు మంచి పలుకుబడి ఉండడం తో ఈయను పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. మరి MVR ఫైనల్ గా ఏ పార్టీలోనైనా చేరుతారా..లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనేది చూడాల్సింది..ఏది ఏమైనప్పటికి MVR రాజకీయాల్లోకి వస్తారనే వార్త ఆ ప్రాంత ప్రజలను ఎంతో సంతోషానికి గురి చేస్తుంది. MVR వెంట మా అడుగు..MVR కే మా ఓటు అని తేల్చి చెపుతున్నారు.

Read Also : Janasena : ఇంకా ఎన్ని త్యాగాలు? సగటు జనసేన మద్దతుదారుడి బాధ?