భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ (Murali Nayak) పాక్ కాల్పుల్లో వీరమరణం పొందారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ త్యాగం దేశ ప్రజలను కంటతడి పెట్టిస్తోంది. ఈ వార్త తెలుసుకున్న వెంటనే మురళీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
Operation Sindoor Movie: ‘ఆపరేషన్ సిందూర్’ మూవీ.. పోస్టర్ వచ్చేసింది
మురళీ నాయక్ పార్దివదేహం ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో ఆయన స్వగ్రామమైన గుమ్మయగారిపల్లికి చేరుకోనుంది. అంతకుముందు రాత్రి 7 గంటలకు గ్రామం నుంచి భారీ ర్యాలీ చేపట్టనున్నారు. గ్రామస్తులు, బంధువులు, సైనిక అధికారులు పాల్గొనే ఈ ర్యాలీ ద్వారా మురళీకి ఘన నివాళులు అర్పించనున్నారు.
రేపు మధ్యాహ్నం ఆయనకు రాష్ట్ర సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చివరి చూపు కోసం మురళీ నాయక్ ఇంటికి ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దేశానికి సేవ చేసి అమరుడైన మురళీ నాయక్ త్యాగం ఎప్పటికీ మరవలేనిది. ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.