అంగన్‌వాడీ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు 2024వ సంవత్సరం మొదటి రోజైన సోమవారం కూడా నిరసనలు కొనసాగించారు. మున్సిపల్ కార్మికులు విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయం దగ్గర నిరసనకు దిగారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించే వరకు ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించారు. విఎంసి కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబూరావు సంఘీభావం తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మున్సిపల్ కార్మికుల ఆందోళన ఏడో రోజు కూడా కొనసాగింది.ఇటు సోమవారం 21వ రోజు ధర్నా చౌక్ వద్ద అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల నిరసనలు కొనసాగాయి. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు తమ ‘న్యాయమైన’ డిమాండ్‌ను అంగీకరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఖండించారు. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల నిరసనలు సోమవారం 13వ రోజు కొనసాగాయి. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు సిపిఎం నాయకులు, సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Also Read: Zomato Order: జొమాటోలో 125 రుమాలీ రోటీలు ఆర్డర్.. సీఈఓ ఆసక్తికర ట్వీట్