Jagan Speech: జగన్ స్పీచ్ లో ‘ముందస్తు’ స్వరం

ముఖ్య‌మంత్రి జగన్ (Jagan) న్యూఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు పార్టీ అంత‌ర్గ‌త విభాగం నుండి స‌మాచారం.

  • Written By:
  • Updated On - May 16, 2023 / 02:02 PM IST

Jagan Speech : కేసుల ఒత్తిళ్ల‌లో వైకాపా హైక‌మాండ్‌ , వెంటాడుతున్న ప్ర‌జా వ్య‌తిరేక‌త భ‌యాలు సొంత పార్టీలోనూ అస‌మ్మ‌తి స్వ‌రాలు , ముఖం చాటేస్తున్న ఢిల్లీ పెద్ద‌లు, అస్మ‌దీయుల‌తో సీఎం జ‌గ‌న్ (CM Jagan) వ‌రుస భేటీలు వెరసి అసెంబ్లీ ర‌ద్దుకే మొగ్గు కనిపిస్తుంది. మరోసారి ఢిల్లీకి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయ‌మ‌నే సంకేతాలు జోరుగా వినిపిస్తున్నాయి. వ‌రుస కేసుల ఒత్తిళ్ల‌లో వైకాపా హైక‌మాండ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ట్లు తెలుస్తోంది. తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు వైకాపా నేత‌లతో ఏ విష‌యానైనా చ‌ర్చించేందుకు ముఖం చాటేస్తున్న‌ట్లు ఢిల్లీలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. అధికార‌పార్టీని సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ కేసుల ఒక్క‌సారిగా చుట్టుముట్ట‌డంతో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి (Jagan Mohan Reddy) ఎన్నికల ప్రచారం తరహాలో నవరత్న మీటింగ్ లు పెడుతున్నారు. ముఖ్య‌మంత్రి న్యూఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు పార్టీ అంత‌ర్గ‌త విభాగం నుండి స‌మాచారం. ముంద‌స్తు ఎన్నిక‌లు త‌థ్యమ‌న్న సోష‌ల్ మీడియాతో పాటు ఇత‌ర మీడియా సంస్థ‌లు ఊహిస్తున్నాయి.

ముందస్తుకు వెళితే మ‌రోసారి అధికారంలోకి తీసుకురాగ‌ల‌మ‌ని, లేదంటే 2024 సాధార‌ణ ఎన్నిక‌ల వ‌ర‌కూ వేచిచూస్తే, పార్టీ ప్ర‌తిష్ట మ‌ట్టిపాల‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని ఈ ప్యాక్ సర్వే సారాంశంగా చెబుతున్నారు.

తాను నెల‌కొల్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2019లో అధికారంలోకి రావ‌డానికి ఎన్నో శ్ర‌మ‌లు ప‌డాల్సి వ‌చ్చింద‌ని, ఇప్పుడు వ‌చ్చిన అవ‌కాశాన్ని చేజార్చుకుంటే… భ‌విష్య‌త్తు మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా ఉంటుంద‌ని సీఎం ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరిగి అధికారంలోకి రావాల్సిందేన‌ని, ఇప్ప‌ట‌కిప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌లు వెళితే తాను నియ‌మించిన స‌ర్వే సంస్థ నివేదికలు సీట్లకు త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయనే విష‌యం స్ప‌ష్ట‌మైంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ 175 స్థానాలు గెలిచి తీరాల‌ని చేసిన వ్యాఖ్య‌ల‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు ఇప్పుడు వీస్తున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారిన ఎంపి అవినాష్ రెడ్డి అంశం..?

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికి ఎంపి అవినాష్‌రెడ్డి అంశం మ‌రింత త‌ల‌నొప్పిగా మారింద‌నే ప్ర‌చారం పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంద‌ని తెలుస్తోంది. సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో పాటు అత్య‌వ‌స‌ర స‌మావేశంలో పాల్గొన్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి కూడా పార్టీని ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం వైపే న‌డ‌పాల‌న్న అభిప్రాయాన్ని వారు వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచార‌ణ పేరుతో అరెస్టు చేస్తే… ముఖ్య‌మంత్రి కుటుంబ స‌భ్యుడు కావ‌డంతో ప్రజ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయని, ఇదే అదునుగా ప్ర‌తిప‌క్ష‌పార్టీలు అన్ని ముక్త కంఠంతో వైసీపీ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దుచేయాల‌న్న డిమాండ్‌తో ఢిల్లీకి వెళ్లే అవ‌కాశాలు కూడా ఉంటాయ‌నే అనుమాన‌లు వారు వ్య‌క్తం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ సమాచారం.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌న అధికారిక న్యూఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ‌మంత్రి అమిత్‌షాల‌ను క‌లుసుకోవ‌డంలో ఉన్న ఆంత‌ర్యంపై గ‌త ఎన్నేళ్లుగా విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. న్యూఢిల్లీ వెళ్లిన సంద‌ర్భంలో కేవ‌లం ప్ర‌ధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాల‌ను మాత్ర‌మే క‌లుసుకోవ‌డంతో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూర్చిన‌ట్లు అయ్యింది. ఇటువంటి కీల‌క స‌మ‌యంలో కుటుంబ స‌భ్యుల కంటే… పార్టీ ప్ర‌తిష్ట ఎంతో ముఖ్య‌మ‌ని సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేసిన‌ట్లుగా చిత్తూరు జిల్లాకు చెందిన నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎంపి అవినాష్ విష‌యంలో ఇప్ప‌టి నుండైనా ఆచితూచి అడుగులు వేయాల‌ని పార్టీలోని అన్ని శ్రేణులకు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలిసింది. పార్టీ ముఖ్య‌మా..? లేదంటే ప‌రువు ప్ర‌ధాన‌మా అనే అంశంలోనే అత్య‌వ‌స‌ర భేటీలో న‌లుగురు క‌లిసి సుదీర్ఘంగా చ‌ర్చించ‌న‌ట్లు అత్యంత విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. భ‌విష్య‌త్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నుండి చెరిగిపోకుండా ఉండేలా చ‌ర్య‌లు ఉండాల‌న్న‌దే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని తెలుస్తోంది. ఈనేప‌థ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ముందు రెండే ఆప్ష‌న్స్ ఉన్నాయ‌ని పార్టీ సీనియ‌ర్ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. వాటిలో మొట్ట‌మొద‌టి ముంద‌స్తు ఎన్నిక‌లు వెళ్ల‌డ‌మే అన్న‌ది మెజార్జీ నేతల అభిప్రాయం కాగా, రెండోవ‌ది మ‌రో ఏడాది వ‌ర‌కూ వేచి చూద్దామ‌ని మ‌రికొందరి అభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది.

దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ముందుకు వెళ్లాలా..?

దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ముందుకు వెళ్లాలా..? లేక వెన‌క‌డుగు వేయాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుంటార‌ని పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి ఒక‌రు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం న్యూఢిల్లీలో కేంద్ర ప్ర‌భుత్వం ఎపీ ప్ర‌భుత్వం విష‌యంలో త‌ట‌స్తంగా ఉంద‌నే వాద‌న‌లు కూడా బ‌లంగా వినిపిస్తున్నాయి. గతంలో సీఎం జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్లి వ‌స్తే రాష్ట్రానికి ఏదోక ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా ఆర్థికశాఖ నుండి క‌నీసం అప్పులైనా అందేవి. కానీ గ‌త కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు ఎవ్వ‌రూ ఏపీవైపు క‌న్నెత్తి చూడ‌టం లేద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.

ఇలాంటి పరిణామాల నడుమ మరోసారి ఢిల్లీ వెళ్ళడానికి రెడి అయిన జగన్ ముందస్తు దిశగా అడుగు వేస్తున్నారని వినికిడి. అందుకే వరుసగా మీటింగ్లు పెడుతూ విపక్షాలను విమర్శిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం పెట్టిన సభల్లో రాజకీయాలు ప్రధానంగా జగన్ వినిపిస్తున్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలంటూ ఇటీవల చెప్పిన ఆయన ఫక్తు రాజకీయాలను సభల్లో ప్రస్తావిస్తున్నారు. అంటే ముందస్తు తథ్యంగా కనిపోయిస్తుంది.

Also Read:  Shivakumar: తెలంగాణపై దృష్టి సారించిన కాంగ్రెస్.. శివకుమార్ ని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్న అధిష్టానం..!