Site icon HashtagU Telugu

TTD : టీటీడీకి రూ.5 కోట్ల విలువైన విండ్ ట‌ర్బైన్ల‌ను విరాళంగా విచ్చిన ముంబై కంపెనీ

Ttd

Ttd

తిరుమలలోని శ్రీవేంకటేశ్వర ఆలయానికి పెద్ద ఎత్తున దాత‌లు విరాళాలు అందిస్తున్నారు. బ‌స్సులు, వైద్య ప‌రిక‌రాల‌తో పాటు, విండ్ ట‌ర్బైన్ల‌ను దాత‌లు అందించారు. రూ. 5 కోట్ల విలువైన పవన విద్యుత్ పరికరాలను ముంబైకి చెందిన ఓ కంపెనీ టీటీడీ అధికారుల‌కు అందించారు. 800 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే విండ్ టర్బైన్‌లను ముంబైకి చెందిన ఓ కంపెనీ విరాళంగా ఇచ్చారని టీటీడీ అధికారి తెలిపారు. విష్ విండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ విరాళంగా ఇచ్చే ఈ టర్బైన్‌లు సంవత్సరానికి 18 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆలయ సంస్థకు ఏటా కోటి రూపాయలు ఆదా చేస్తాయి. టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి శుక్రవారం టర్బైన్‌ల ఏర్పాటు పనులను సందర్శించారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత విద్యుత్ ఉత్పత్తిని టీటీడీ చైర్మన్ భూమ‌న కరుణాకరరెడ్డి ప్రారంభిస్తారని టీటీడీ తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

విష్ విండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 15 సంవత్సరాల క్రితం రెండు విండ్ టర్బైన్‌లను ఏర్పాటు చేసింది, ఇది టీటీడీ అవసరాలను తీర్చడానికి 1.03 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మ‌రోవైపు చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ శుక్రవారం రూ.80 లక్షల విలువైన రెండు బస్సులను టీటీడీకి అందించింది. ఈ బస్సులను ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ సీనియర్ అధికారులు పి.సత్యనారాయణన్, నారాయణరావులు శ్రీవారి ఆలయం ముందు ధర్మారెడ్డికి అందజేశారు. గురువారం, బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) వైద్య పరికరాల కొనుగోలు కోసం టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ కేర్ ఆసుపత్రికి రూ.1.51 కోట్లను విరాళంగా అందించింది.

Also Read:  Resorts Politics: కాంగ్రెస్ బీ అలర్ట్, గెలిచే అభ్యర్థులు క్యాంపులకు?

Exit mobile version