Site icon HashtagU Telugu

AP : రౌడీ మూకలకు ముఖేష్ కుమార్ మీనా స్ట్రాంగ్ వార్నింగ్..

Meenakumar

Meenakumar

ఏపీలో ఎన్నికల పోలింగ్ ఆలా ముగిశాయో లేదో వైసీపీ – టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది రౌడీ మూకల దాడులను అందర్నీ ఖంగారుకు గురి చేస్తున్నాయి. చంద్రగిరి, తాడిపత్రి, రెంటచింతల, పల్నాడు, తిరుపతి నియోజకవర్గాలతో పాటు పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. ప్రస్తుతం అక్కడి ప్రాంతాలన్నీ ఎప్పుడు ఏంజరుగుతాయో అనే ఆందోళలన ఉంది. ఇదే క్రమంలో పలు అనుమానాలు ప్రజల్లో రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలకు ఇంకా 20 రోజుల సమయం ఉంది. ఈ సమయంలో ఎవరైన ఈవీఎం లపై దాడులు చేస్తే ఎలా..? భద్రపరిచిన ఈవీఎం లు సేఫ్ నా..? లేక వాటిని ఏమైనా చేస్తారా..? అనే ఆందోళన ఓటర్లతో పాటు రాజకీయ నేతల్లో కూడా నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన 4 దశల పోలింగ్లో దేశంలోనే అత్యధిక ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో నమోదైందని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 81.86శాతం ఓట్లు పోలైనట్లు ఆయన వెల్లడించారు. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని, తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32 శాతం నమోదైందన్నారు. 3500 కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని, కొన్నిచోట్ల అర్ధరాత్రి 2 వరకు పోలింగ్ కొనసాగినట్లు తెలిపారు. పార్లమెంట్ కు 3,33,40,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు’ అని తెలిపారు.

తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేటలో గొడవలు జరిగాయని వెల్లడించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు అదనపు బలగాలు పంపించామని, ఆ 4 ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశామని తెలిపారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించిన నిందితులను రెండ్రోజుల్లో అరెస్ట్ చేస్తామని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో 715 ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటలు ఉండవచ్చని క్లారిటీ ఇచ్చారు.

Read Also : Election Commission : ఏపీలో ఉద్రిక్తతలపై ఈసీ సీరియస్.. సీఎస్, డీజీపీకి సమన్లు