Site icon HashtagU Telugu

AP Elections : 46,165 పోలింగ్ కేంద్రాలు సిద్ధం

Mukesh Kumar Meena About Ap

Mukesh Kumar Meena About Ap

ఏపీలో ఈ నెల 13 న అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ , కూటమి పార్టీలు కష్టపడుతున్నాయి. ఈ తరుణంలో పోలింగ్ కు సంబదించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీడియా తో పంచుకున్నారు. రాష్ట్రంలో ఎన్ని పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసారు..? ఎంతమంది ఓటర్లను ఉన్నారు..? ఇప్పటివరకు ఎంత నగదును సీజ్ చేసారు..? ఎన్ని కోట్ల మద్యాన్ని సీజ్ చేసారు..? తదితర విషయాలను మీడియా కు తెలియజేసారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46, 165 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.14 కోట్లు కాగా , ఇందులో 65,707 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు అవకాశం కల్పించామన్నారు. ఒకవేళ ఒటర్ల సంఖ్య 1500 దాటితే ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 150 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 181 ఇంట్రా స్టేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పటివరకు రూ. 203 కోట్లు సీజ్ చేశామని, రూ. 47 కోట్లు నగదు కాగా, రూ. 20 కోట్ల మద్యాన్ని సీజ్ చేశామని స్పష్టం చేశారు.

Read Also : BJP : బీజేపీ 17వ జాబితా విడుదల