Site icon HashtagU Telugu

Mukesh Ambani: టీటీడీకి అంబానీ రూ. 1.5 కోట్ల విరాళం

Ambani

Ambani

రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ శుక్రవారం టీటీడీకి రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. కొండ గుడిలో ప్రార్థనలు చేసిన తర్వాత, కార్పొరేట్ దిగ్గజం తిరుమలలోని ఎస్వీ గోశాలను కూడా సందర్శించారు.

ఎంపీలు గురుమూర్తి, విజయసాయిరెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు భాస్కర్ రెడ్డి అంబానీ వెంట ఉన్నారు. అంతకుముందు టీటీడీ ఈవో ధర్మారెడ్డి దగ్గరుండి అంబానీకి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.