జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మరో లేఖను రాశారు. జనసేన పార్టీలోని నాయకుల నుండి తీవ్ర ప్రతిస్పందనలను రేకెత్తిస్తూ ఇప్పటికే ఆయన విమర్శనాత్మక లేఖ సంధించిన విషయం తెలిసిందే. తాజాగా పద్మనాభం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మరో ఘాటైన లేఖను విడుదల చేస్తూ ముద్రగడ (Mudragada) సవాల్‌ను విసిరారు.
దమ్ము, ధైర్యం ఉంటే మీరు తిట్టండి అని.. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిదని పవన్‌పై విరుచుపడ్డారు. మీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదంటూనే. కాకినాడలో పోటీ చేయడం చేతకాకపోతే పిఠాపురంలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. ఒంటరి వాడిని..ఏమన్నా పడతాననే గర్వమా అని పవన్ ను ప్రశ్నించారు. వంగవీటి రంగా హత్య సమయంలో జరిగిన అల్లర్లలో అరెస్టై, కేసులు ఎదుర్కొంటున్నవారిని ఎప్పుడైనా పరామర్శించారా..? అంటూ విమర్శించారు.
పవన్ కళ్యాణ్ గురించి పత్రికల్లో ఎలాంటి ప్రకటనలు చేయలేదని పద్మనాభం లేఖలో స్పష్టం చేశారు. కాకినాడ మీటింగ్‌లో కళ్యాణ్ తనపై విమర్శలు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తనకు అనుచిత సందేశాలు వస్తున్నాయని పద్మనాభం ఆరోపించారు. అయినప్పటికీ నేను అలాంటి శత్రుత్వాన్ని ఎదుర్కొంటూ నిశ్చయంగానే ఉన్నానని అన్నాడు. పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం మధ్య కొనసాగుతున్న వివాదం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.
Also Read: PM Modi: ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిగా నిలిచింది: ప్రధాని మోడీ