Mudragada Padmanabham : మార్చి 14 న వైసీపీ లోకి ముద్రగడ ..

  • Written By:
  • Publish Date - March 10, 2024 / 11:36 AM IST

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) వైసీపీ (YCP)లో చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 14న ముద్రగడ ఫ్యామిలీ వైసీపీ కండువా కప్పుకోబోతుంది. ఈ విషయాన్నీ స్వయంగా ముద్రగడ తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లో చేరబోతున్నట్లు..తనతో పాటు తన కుమారుడు కూడా పార్టీలో చేరుతారని వెల్లడించారు. ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ, కుమారుడు కానీ పోటీపై ఎలాంటి కండిషన్లు పెట్టలేదన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏలాంటి పదవులు కూడా ఆశించడం లేదని… ప్రజలకు సేవ చేయటమే తన లక్ష్యమన్నారు. వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గోంటానని వెల్లడించారు. రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు రావాలనే ఉద్దేశ్యంతో వైసీపీలో చేరుతున్నట్లు నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చారు. పోటీపై ఎలాంటి కండిషన్ లేకుండానే చేరుతున్నట్లు.. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఏదైనా పదవి ఇస్తే తీసుకోవటానికి సముఖంగా ఉన్నాను. ప్రస్తుతానికి అయితే పోటీ చేసే ఉద్దేశ్యం లేదు. నా కుమారుడు కూడా చేయడు. జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు నా వంతు కృషి చేస్తాను అని జగన్ కు చెప్పాను” అని వెల్లడించారు.

Read Also : 2024 Oscar Awards : ఆస్కార్ అవార్డుల రేసులో టాప్ 10 మూవీస్.. ఇవే