Mudragada Padmanabham : పవన్ కు ముద్రగడ బహిరంగ లేఖ..

  • Written By:
  • Publish Date - February 29, 2024 / 11:23 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) కు కాపు ఉద్యమ నేత ముద్రగడ (Mudragada Padmanabham) బహిరంగ లేఖ (Letter) రాసారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని అభ్యర్థులను ప్రకటించిన జనసేన – టిడిపి..ఇప్పుడు తమ ప్రచారాన్ని స్పీడ్ చేసాయి. నిన్న తాడేపల్లి గూడెంలో ఉమ్మడి సభ పెట్టి కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ 24 సీట్ల ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో..ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది..తనకు సలహాలు, సూచనలు ఇచ్చే వారికీ పలు హెచ్చరికలు ఇలా అన్నింటికీ క్లారిటీ ఇచ్చారు.

ఈ తరుణంలో ముద్రగడ.. పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాసారు. లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. తనను కలుస్తానని పవన్ కలవకపోవటం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. 80 సీట్లు.. రెండేళ్ల సీఎం పదవి కోరాల్సిందని సూచించారు. జనసేన పోటీ చేస్తున్న 24 మందికి తన అవసరం రాకూడదని పేర్కొన్నారు. పవన్ తనను కలవటానికి ఇతరుల అనుమతి అవసరం అనుకుంటాని ముదగ్రడ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

పవన్‌ కాకినాడలో పర్యటన చేసిన సమయంలో పలుమార్లు కిర్లంపూడిలోని మా ఇంటికి వస్తానని కబురు పంపి మరి రాలేదు. 2019 ముందు కవాతి చేసిన సమయంలో కూడా మా ఇంటికి వస్తానని చెప్పి రాలేదు. అయోధ్య వెళ్లి వచ్చిన తరువాత వస్తానని చెప్పి రాలేదు. ఇప్పటికి చాలా సార్లు మీ మనుషులతో కబురు పంపినప్పటికీ మీరు మాత్రం రాలేదు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎంతో మంది దగ్గర పర్మిషన్ తీసుకుని రావాలి. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు…రాకూడదని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.

నాకు ఎటువంటి కోరికలు లేకుండా నిస్వార్థంగా మీతో పాటు పని చేసేందుకు నేను సిద్ధపడ్డాను…రాష్ట్ర ప్రయోజనాల కోసం నా గతం, నా అవమానాలు, నా బాధలు, ఆశయాలు, కోరికలు అన్ని మరిచిపోయి మీతో పని చేసేందుకు సిద్దమయ్యాను. మీలాగా నేను గ్లామర్ ఉన్న వారిని పరపతి ఉన్న వాడిని కాదు తుప్పుపెట్టిన ఇనుము లాంటివాడిని అందుకే నన్ను లాస్ట్ గ్రేట్ లో పెట్టారు..అంటూ ముద్రగడ పవన్‌ కు లేఖ రాశారు. దీనిపై పవన్ ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి.

Read Also : Khammam : రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడి పై కత్తులతో దాడి..