Site icon HashtagU Telugu

AP Politics: జగన్ కోటరీలో `ముద్రగడబిడ `

Mudragada Padmanabham

Mudragada Padmanabham

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాదన్నవారినే కౌగిలించుకునే పరిస్థితి.. అవునన్న వారినే దూరం పెట్టే సీన్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు.. ఇదే పరిస్థితి వైసీపీకి కూడా ఎదురైంది. అధికారంలో ఉన్న వైసీపీకి కంటిపై కునుకు లేకుండా పోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలలోనూ విజయం దక్కించుకుని.. మళ్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ అనేక కలలు కంటున్న విషయం తెలిసిందే. అందుకే.. ఎక్కడా.. తనకు ఎదురు ఎవరు రాకుండా.. లేకుండా చూసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే.. వైసీపీ దూకుడును నిలువరించేందుకు ప్రతిపక్షాలు కూడా.. అదే రేంజ్లో ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ క్రమంలో.. నిన్న మొన్నటి వరకు.. దూరంగా ఉన్న టీడీపీ – జనసేనలు చేతులు కలిపాయి. దీనికి వైసీపీనే కారణమనే వాదన అందరికీ తెలిసిందే. జనసేనను రెచ్చగొట్టడం.. పదే పదే..పవన్ ను టార్గెట్ చేయడం.. దీనికితోడు.. జనసేన కార్యకర్తలపైనా.. కేసులు పెట్టడంవంటివి తెలిసిందే. అయితే.. ఇన్నాళ్లుగా ఓర్చుకున్న జనసేనాని.. కార్యకర్తల్లో మనోధైర్యం పెంచేందుకు.. పోరాటమే శరణ్యంగా తీసుకున్నారు. మరీముఖ్యంగా ప్రజలకు ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వాలంటే.. మరో పార్టీతో పొత్తు తప్పదని అనుకున్నట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన టీడీపీతో చేతులు కలిపారు. ఇదే ఇప్పుడు వైసీపీకి చలీ-జ్వరం వచ్చేలా చేసిందని అంటున్నారు పరిశీలకులు.

Also Read:   AP Politics: జగన్ పై `రెడ్డి` తిరుగుబాటు? ముహూర్తం కార్తీక సమారాధన

జనసేన ఒంటరిగా ఉంటే.. పరిస్థితి వేరు. కానీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే తన కూసాలు కదిలిపోతాయని బావిస్తున్న వైసీపీ నాయకులు.. వెంటనే కుల సంఘాల్లో బలమైన నాయకులకు గేలం వేయడం ప్రారంభించారు. ముఖ్యంగా పవన్ సామాజిక వర్గం కాపు కులానికి చెందిన బలమైన నాయకుడిగా పేరున్న కేంద్ర మాజీ మంత్రి ముద్రగడపద్మనాభాన్ని తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తూర్పుగోదావరిజిల్లాలో పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది. ఇటీవల వైసీపీ నాయకులు కొందరు ముద్రగడను సంప్రదించారని కూడా.. వారు చెబుతున్నారు. మీరు పార్టీలోకి రండి.. మీ గౌరవం ఏమాత్రం తగ్గదు. మంచి పదవి కూడా ఇస్తాం! అని వారు జగన్ తరఫున హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

నిజానికి ముద్రగడ కూడా.. ఇప్పుడు రాజకీయ ప్లాట్ ఫాం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన వాయిస్ ఒంటరి వినిపించినప్పుడే.. కొన్ని పార్టీలు ఆయనను చేర్చుకునేందుకు ప్రయత్నించాయి. బీజేపీ నేత సోము వీర్రాజు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. టీడీపీ కూడా గతంలో హామీ ఇచ్చింది. పార్టీలోకి రావాలని సూచించింది. కానీ అప్పట్లో ముద్రగడస సేమిరా అన్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో `చూస్తాను.. ఆలోచిస్తాను` అని వైసీపీ నాయకులకు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ వ్యూహం సక్సెస్ అయితే.. కాపు సమాజాన్ని ముద్రగడ ను అడ్డుపెట్టుకునైనా.. తమవైపు తిప్పుకోవాలని వైసీపీ అంచనా వేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:  Jagan Attack Case : జగన్ ఇలాఖాలో `కోడి కత్తి` డ్రామా