Site icon HashtagU Telugu

Mudragada : జ‌న‌సేన‌కు చెక్ పెట్టేలా ముద్ర‌గ‌డ?

Mudragada

Mudragada

కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం(Mudragada). ఆ వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్లు(Kapu Reservation) కావాల‌ని పోరాడిన యోధుడు. రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌లికాన‌ని ఇటీవ‌ల వ‌ర‌కు చెప్పిన ఆయ‌న ఇప్పుడు మ‌ళ్లీ రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌కు దిగారు. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని వెల్ల‌డించారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎత్తుగ‌డ‌ల‌కు అనుగుణంగా ఆయ‌న స్టెప్స్ వేసే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే కాపుల కోసం బీఆర్ఎస్ పార్టీ గాలం వేస్తోంది. ఆ సామాజిక‌వ‌ర్గాన్ని సొంతం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది.

కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం(Mudragada).

జ‌న‌సేన ఏపీ అధ్య‌క్షుడుగా తోట చంద్ర‌శేఖ‌ర్ రావు(Chandrasekhar Rao) బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ త‌రువాత కాపు సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌కు గాలం వేసే ప్ర‌య‌త్నం ఆ పార్టీ చేసింది. కానీ, వ‌ర్కౌట్ కాలేదు. అయితే, పార్టీని విస్త‌రింప చేయ‌డానికి ఎత్తుగ‌డ‌లు వేస్తూనే ఉంది. ఆ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు(Pawan kalyan) ఒక బిగ్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది. అయితే, దానిపై అటు బీఆర్ఎస్ గానీ, జ‌న‌సేన‌గానీ ఖండించ‌లేదు. అంటే, ఏదో బీఆర్ఎస్, జ‌న‌సేన మ‌ధ్య జ‌రుగుతుంద‌ని అనుమానాలు కూడా వ‌చ్చాయి. కానీ, తాజా ప‌రిస్థితుల్లో జ‌నసేన‌, టీడీపీ క‌లిసి వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆ మేర‌కు బ‌ల‌మైన సంకేతాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. అందుకే, ప్ర‌త్యామ్నాయ మార్గాల వైపు బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఇదే స‌మ‌యంలో ముద్ర‌గ‌డ (Mudragada)భ‌విష్య‌త్ రాజ‌కీయం వైపు అడుగులు వేస్తున్నారు.

బీఆర్ఎస్ వైపు వెళ‌తార‌ని

కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం అలుపెర‌గ‌ని యోధునిలా అప్ప‌ట్లో చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా పోరాడారు ముద్ర‌గ‌డ‌(Mudragada). సీన్ క‌ట్ చేస్తే 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) సీఎం అయ్యారు. ఆ త‌రువాత ఆయ‌న ఎక్క‌డా కాపు రిజ‌ర్వేష‌న్ల గురించి పెద్ద‌గా మాట్లాడిన దాఖ‌లాలు లేవు. ఇటీవ‌ల ర‌త్నాచ‌ల్ ఎక్స్ ప్రెస్ త‌గులబెట్టిన కేసుల‌ను, కాపు రిజ‌ర్వేష‌న్ కోసం పోరాడిన వాళ్ల‌పై ఉన్న కేసులు మాఫీ అయ్యాయి. దీంతో రాజ‌కీయ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ అంటూ ఇప్పుడు ముద్ర‌గ‌డ ముందుకొస్తున్నారు. అయితే, ఆయ‌న బీఆర్ఎస్ వైపు వెళ‌తార‌ని తెలుస్తోంది.

Also Read : CBN Rally : చంద్ర‌బాబు పాద‌యాత్ర‌, 12న`రైతు పోరుబాట‌`

వాస్త‌వంగా రెండేళ్ల క్రితం బీసీలు, కాపులు సంయుక్తంగా ఒక పార్టీని పెట్టాల‌ని ప్ర‌య‌త్నాలు చేశారు. అందుకోసం హైద‌రాబాద్ కేంద్రంగా మీటింగ్ లు పెట్టారు. కానీ, ఏపీలోని బీసీలు మెజార్టీ క‌లిసి రాలేదని తెలుస్తోంది. అందుకే, కొత్త పార్టీ ప్ర‌తిపాద‌న అట‌కెక్కింది. ఆ రోజు నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన ముద్ర‌గ‌డ(Mudragada) ఇప్పుడు బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్న‌ట్టు కనిపిస్తోంది. దానికి కార‌ణం లేక‌పోలేదు. ఆయ‌న తొలి నుంచి వైఎస్ కుటుంబానికి ద‌గ్గ‌ర‌గా ఉంటారు. అందుకే, ఆయ‌న్ను ఒక అస్త్రంగా ఉప‌యోగించుకుని కాపు ఉద్య‌మాన్ని ఆనాడు నడిపార‌ని కూడా ముద్ర‌గ‌డ మీద టీడీపీ చేసే ఆరోప‌ణ‌. అందుకు అనుగుణంగా ఆయ‌న అడుగులు, రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : YCP-TDP : జ‌గ‌న్ న‌జ‌ర్,చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌పై జీవో నెంబ‌ర్ 1

కాపు ఓట్ల కోసం జ‌న‌సేన పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుంది. అయితే, కాపు ఓట్ల‌ను చీల్చ‌డానికి ఇప్ప‌టికే బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్ర‌శేఖ‌ర్ రావు (Chandrasekhar rao)రంగంలోకి దిగారు. కానీ, ఆయ‌న బ‌లం చాల‌ద‌ని భావించిన బీఆర్ఎస్ ఇప్పుడు ముద్ర‌గ‌డ (Mudragada) మీద ఆప‌రేష‌న్ ప్రారంభించింద‌ని తెలుస్తోంది. ఇదంతా రాజ‌కీయంగా వేర్వేరుగా చూడ‌లేని కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంయుక్త ఎత్తుగ‌డ‌లోని కీల‌క ఎపిసోడ్ గా కొంద‌రు భావిస్తున్నారు. ఒక వేళ జ‌న‌సేన ఒంట‌రిగా పోటీ చేస్తే స‌రి, లేదంటే ముద్ర‌గ‌డ రూపంలో బీఆర్ఎస్ దూసుకువ‌చ్చేలా మాస్ట‌ర్ స్కెచ్ సిద్ద‌మ‌యింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల్లోని అభిప్రాయం. అందుకే, ముద్ర‌గ‌డ భ‌విష్య‌త్ రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ దిశ‌గా డైలాగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది.