Site icon HashtagU Telugu

Mudragada :పద్మనాభరెడ్డిగా మార్చుకునేందుకు సిద్ధం అంటున్న ముద్రగడ

Mudragada Padmanabha Reddy

Mudragada Padmanabha Reddy

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ఓడిస్తానని..ఆలా ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శబధం చేసిన ముద్రగడ (Mudragada Padmanabham)..తాను చెప్పినట్లు తన పేరును మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. దీనిపై ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వైసీపీ ఘోర ఓటమిపై విచారం వ్యక్తం చేసిన ఆయన… పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్ ను ఓటర్లు ఎందుకు ఆదరించలేదో అర్థం కావట్లేదని అన్నారు. ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఏది ఏమైనా తన రాజకీయ నడక జగన్ తోనే అని ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చారు. పిఠాపురంలో పవన్‌ను ఓడిస్తామని సవాల్‌ చేశానని, అలా చేయకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పినట్లు గుర్తుచేశారు. ఈ క్రమంలో ఆయన పేరును మార్చుకునేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

ఏదో మాట వరసకు తన పేరును మార్చుకుంటానని చాలామంది సవాల్​ చేస్తుంటారు. కానీ దాన్ని ఆచరణలో పెట్టటంలో వెనకడుగు వేస్తారు. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 70 వేల పైచిలుకు మెజార్టీతో గెలవడం, జనసైనికులు, కాపులు ముద్రగడ పద్మనాభరెడ్డి నామకరణ మహోత్సవం అంటూ ట్రోలింగ్ చేస్తుండటం ఆయనకు చిర్రెత్తిస్తున్నాయి. అందుకే ఇలా మీడియా ముందుకు వచ్చి పేరు మార్చుకుంటున్నట్లు తెలిపినట్లు ఉంది.

Read Also : Pawan Kalyan : అసెంబ్లీ లోకి ప్రధాన ప్రతిపక్షంగా అడుగు పెడుతున్నాం – పవన్ కళ్యాణ్