AP : జనసేన తీర్థం పుచ్చుకోవడమే ఆలస్యం..జగన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలశౌరి

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి (MP Vallabhaneni Balashowry) ఎట్టకేలకు జనసేన (Janasena) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. బాలశౌరి తో పాటు ఆయన కుమారుడు అనుదీప్ సైతం జనసేనలో చేరారు. జనసేన తీర్థం పుచ్చుకోవడం ఆలస్యం..వైసీపీ అధినేత, సీఎం జగన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని భావించాం.. కానీ […]

Published By: HashtagU Telugu Desk
Mp Vallabhaneni Balashowry

Mp Vallabhaneni Balashowry

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి (MP Vallabhaneni Balashowry) ఎట్టకేలకు జనసేన (Janasena) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. బాలశౌరి తో పాటు ఆయన కుమారుడు అనుదీప్ సైతం జనసేనలో చేరారు. జనసేన తీర్థం పుచ్చుకోవడం ఆలస్యం..వైసీపీ అధినేత, సీఎం జగన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు.

జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని భావించాం.. కానీ జగన్ పాలనలో ఏపీ ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. ‘సిద్ధం’ అంటూ మీటింగ్‌లు పెడుతున్న వైసీపీ దేనికి సిద్ధమని, పారిపోవడానికి సిద్ధమా అంటూ సెటైర్లు వేశారు. తాను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదని జగన్ చెబుతారు.. కానీ జగన్ ఇస్తున్న హామీలన్నీ అబద్దాలే అని బాలశౌరి చెప్పుకొచ్చారు. పవన్ సమక్షంలో జనసేనలోకి వచ్చినందుకు తనకు ఆనందంగా ఉందని.. ఇక పవన్ తోనే తన రాజకీయ జీవతం అని బాలశౌరి స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. దమ్ము, ధైర్యంతో గొంతెత్తే వ్యక్తి పవన్ అని కొనియాడారు. రాష్ట్రంలో పవన్ ఉండడం వల్లే కొద్దో గొప్పో ప్రజాస్వామ్యం అమలవుతోందని తెలిపారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వానికి భయపడి ఎవరూ టెండర్లు వేయడానికి కూడా రావడం లేదని అన్నారు.

Read Also : TS : కృష్ణానదీ జల వనరుల ప్రాజెక్టులపై చర్చ కు మీము సిద్ధం..మీరు సిద్ధమా..? – హరీష్ రావు

  Last Updated: 04 Feb 2024, 11:30 PM IST