ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ పక్క టీడీపీ(TDP) అభ్యర్థులను ప్రకటిస్తున్న క్రమంలో వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు ఆ పార్టీ లోకి చేరుతూ వస్తున్నారు. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ (Kurnool MP Sanjeev Kumar) ఆయుష్మాన్ ఈరోజు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సంజీవ్ కుమార్.. బాబు తో చర్చలు జరిపి..టీడీపీ కండువా కప్పుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. కర్నూలు అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే టీడీపీ పార్టీలో చేరినట్టు పేర్కొన్నారు. ఎలాంటి సీటు ఆశించకుండా బేషరతుగానే టీడీపీలోకి వచ్చానని స్పష్టం చేసారు. తగు ప్రత్యామ్నాయం చూస్తానని తనకు చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. కర్నూలు ప్రాంతం నుంచి వలసలు, దారిద్య్రం నివారించలేకపోయాననే బాధ తనకు ఉందన్నారు. రెండు నదుల మధ్యలో ఉన్న కర్నూలుకు తాగు నీరు కూడా ఇవ్వలేనప్పుడు ఎంపీగా ఎందుకు కొనసాగాలని అనిపించిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నియోజక పరిధిలోని ఏడు స్థానాలు టీడీపీ గెలవబోతోందని సంజీవ్ కుమార్ జోస్యం చెప్పారు. వైసీపీ పదవులు ఇచ్చినా గాని వారి చేతిలో అధికారం మాత్రం ఉండదన్నారు. పదవి ఉన్నా ఉత్సవ విగ్రహంగా ఉండడం అనేది తనకు నచ్చలేదన్నారు.
Read Also : One Nation One Election: ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక