MP Ravi Kishan about Tirumala Laddu Issue : దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం (Tirumala Laddu Issue)ఫై చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. యావత్ హిందువులు ఎంతో పవిత్రంగా భవించే లడ్డు..గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అపవిత్రమైంది. ఈ తప్పును సరిద్దికోవాలని ..ప్రతి ఒక్కరు కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి కి పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై ప్రతి ఒక్కరు స్పందిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఫై , గత TTD పాలకుల నిర్లక్ష్యం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..దీనికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు విధించాలని ఏపీ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని కోరుతున్నారు.
ఈ క్రమంలో టీటీడీ గత పాలకులు హిందువులు కాదని నటుడు, ఎంపీ రవికిషన్ (MP Ravi Kishan) ఆరోపించారు. గత పాలకుల హయాంతో తిరుమలకు వచ్చిన భక్తులకు గొడ్డు మాంసంతో చేసిన లడ్డూలను ఇచ్చారని ఆరోపించారు. శాస్త్రాలతో పాటు శస్త్రాలను కూడా వెంట తీసుకుని వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దీనికోసం పోరాడేందుకు సాధువులు కూడా యోధులుగా మారాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. తెలుగు సినిమాల్లో విలన్ వేషాలు వేసే ఈయన ఇపుడు పవన్ కళ్యాణ్ లా రియల్ హీరోగా తిరుమల లడ్డూపై స్పందించడాన్ని హిందూ సంఘాలు ఆహ్వానిస్తున్నాయి.
తిరుమల లడ్డూ కల్తీ జరగడంతో కలత చెందిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ మెట్లను శుభ్ర పరిచారు. అంతే కాదు ఈ విషయంలో ఎవరైనా తప్పుగా మాట్లాడితే సహించనని హెచ్చరిక కూడా జారీ చేసారు. హిందువులంటే చిన్న చూపా..హిందూ దేవుళ్లంటే లెక్క లేదా..? అంటూ ప్రశ్నించారు. చిత్రసీమలో కొంతమంది లడ్డు విషయంలో స్పందించిన తీరు ఫై కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు.
Read Also : Minister Sitakka : గవర్నర్‌తో మంత్రి సీతక్క భేటీ.. కీలక బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి