CM Jagan : జగన్, సీబీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ‘బెయిల్‌ రద్దు’ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

CM Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు అక్రమాస్తుల కేసులో బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.

  • Written By:
  • Publish Date - November 24, 2023 / 01:30 PM IST

CM Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు అక్రమాస్తుల కేసులో బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. గత పదేళ్లుగా జగన్‌ బెయిల్‌పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని.. వెంటనే బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామ తరపు న్యాయవాది కోర్టును కోరారు. జగన్ బెయిల్‌ను సీబీఐ, ఈడీ కూడా సవాల్ చేయడం లేదని తెలిపారు. విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని రిక్వెస్ట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈవాదనలు విన్న జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. సాక్ష్యాలను చెరిపేస్తున్నారు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? అని ప్రశ్నించింది. కేసు పూర్వాపరాలు, జరిగిన ఘటనలపై లిఖితపూర్వకంగా వివరాలను రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు అందించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం జగన్‌, సీబీఐ సహా ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది.  జగన్ అక్రమాస్తుల కేసు విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని గతంలోనే రఘురామ ఓ  పిటిషన్ వేశారు. దాన్ని కూడా ఈ పిటిషన్‌కు జత చేయాలని రిజిస్ట్రీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి మొదటి వారానికి వాయిదా(CM Jagan) వేసింది.

Also Read: Google Pay Transaction: గూగుల్ పే లావాదేవీల హిస్టరీను ఎలా తొలగించాలో తెలుసా..?