Raghu Rama Krishna Raju: ఎట్టకేలకు వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా

  • Written By:
  • Publish Date - February 24, 2024 / 11:59 AM IST

 

 

Raghu Rama Krishna Raju: వైసీపీ(ysrcp)కి ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా(resigns) చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్(cm jagan) కు పంపించారు. గజనీలాంటి మనస్తత్వం కలిగిన మీతో కలసి తాను పని చేయలేనని లేఖలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత మూడేళ్లుగా వైసీపీకి వ్యతిరేకంగా రఘురాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు తన రచ్చబండ కార్యక్రమం ద్వారా వైసీపీని ఎండగడుతున్నారు.

తనపై ఎంపీగా అనర్హత వేటు వేయించేందుకు మొహమ్మద్ గజినీ మాదిరి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారని… మీరు కోరుకున్న ఫలితం ఈరోజు వచ్చిందని రాజీనామా లేఖలో రఘురాజు పేర్కొన్నారు. తనపై మీరు దాడి చేసిన ప్రతిసారి, తనను భౌతికంగా నిర్మూలించాలని మీరు ప్రయత్నించినప్పటికీ… తాను కూడా అంతే స్థాయిలో తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేశానని చెప్పారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు టీడీపీ(tdp) – జనసేన(jana sena)లు తమ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తున్నాయి. టీడీపీ తరపున పోటీ చేయాలని రఘురాజు భావిస్తున్నారు. అయితే, పొత్తులో భాగంగా నర్సాపురం నియోజకవర్గాన్ని ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ తరపున ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.

కాగా, ఎంపీ రఘురామ కృష్ణరాజు… ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా అధికార వైసీపీ(ysrcp)లో ఈ పేరు తెలియని వాళ్లుండరు. ఎందుకంటే సమస్య ఏదైనా రచ్చబండ అంటూ వైసీపీ లక్ష్యంగా విమర్శలు చేయడమే ఆయన స్పెషల్. సీఎం జగన్ పేరు చెబితే చాలు రఘురామకృష్ణరాజుకు ఎక్కడలేని తిట్లదండకం గుర్తొస్తుంది. వైసీపీ నుంచి గెలిచిన రఘురామ… కొన్నాళ్లకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి విమర్శలు స్టార్ట్ చేశారు. అయితే పార్టీ సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేయలేదు. రెబల్ ఎంపీగా ఉంటూ పార్టీ విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలపై దిల్లీ వేదిక రచ్చబండ అంటూ రచ్చ చేసేవారు. దీంతో ఏపీ ప్రభుత్వం సీఐడీని రంగంలోకి దించి అరెస్టు చేయించింది. ఆ తర్వాత కోర్టుకు నడవలేని పరిస్థితిలో వచ్చిన ఆయన… సీఎం జగన్ సీఐడీని అడ్డుపెట్టుకుని తనను హింసించారని కోర్టుకు తెలిపారు. కోర్టు బెయిల్ తో బయటపడ్డ ఆయన… ఇక అప్పటి నుంచి మరింత రెచ్చిపోయారు. ప్రతీ రోజు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వంపై, ముఖ్యంగా వైసీపీపై విరుచుకుపడుతుంటారు. 2019లో ఎంపీగా ఎన్నికైన రఘురామ… సొంత నియోజకవర్గంలో ఉన్నది కాస్త తక్కువే. దాడులకు భయపడో మరేకారణాలతోనో ఆయన ఢిల్లీకే పరిమితం అయ్యారు.

read also : Jaahnavi Kandula : తెలుగు విద్యార్థిని పైనుంచి కారు నడిపిన పోలీస్.. ఇండియా రియాక్షన్