Site icon HashtagU Telugu

Mithun Reddy : ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట!

Mp Mithun Reddy Gets A Small Reprieve From The High Court!

Mp Mithun Reddy Gets A Small Reprieve From The High Court!

Mithun Reddy : వైస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ స్కాంలో సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. అయితే తాను ఒకరోజు ముందే విచారణకు హాజరవుతానని సమాచారం ఇచ్చారు. ఈ విషయంలో సిట్ కూడా అంగీకరించింది.

Read Also: Thaman : బాలకృష్ణ ఫస్ట్ చిత్రానికి థమన్ రూ.30 ల రెమ్యూనరేషనే తీసుకున్నాడా..?

కాగా, మరోవైపు ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట దక్కింది. ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. లిక్కర్ స్కాంలో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించింది. అయితే విచారణ సమయంలో స్టేట్‌మెంట్ రికార్డు చేయటంలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. స్టేట్‌మెంట్ ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి లాయర్ కోరగా.. విజిబుల్ సీసీ కెమెరాలు ఉన్న చోట విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించింది.

కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని కూటమి నేతల ఫిర్యాదుతో విచారణ మొదలు కావటం.. ఓ సిట్ ను విచారణకు నియమింది. దీంతో గత పదినెలలుగా విచారణ సాగుతూనే ఉన్న విషయం తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వానికి ఊహించని విధంగా మాజీ వైసీపీ కీలక నేత సాయిరెడ్డి మద్యం కేసులో కర్త, కర్మ, క్రియ మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ చేసిన లీక్స్ ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టించాయి. అంతేకాదు, మద్యం కేసులో విచారణకు వస్తే తనకు తెలిసిన సమాచారం మొత్తం సిట్ అధికారులకు ఇస్తానని గతంలోనే సాయిరెడ్డి ప్రకటించారు.

Read Also: Robert Vadra : ఈడీ అదే ప్రశ్నలు వేస్తోంది: రాబర్ట్‌ వాద్రా