MP Kesineni Nani : టీడీపీ ఎంపీ కేశినేని సంచ‌ల‌న నిర్ణ‌యం.. త్వ‌రలో ఎంపీ ప‌ద‌వికి, పార్టీకి రాజీనామా

  • Written By:
  • Publish Date - January 6, 2024 / 06:40 AM IST

బెజ‌వాడ రాజ‌కీయాలు హాట్‌హాట్‌గా మారాయి. టీడీపీలో వ‌ర్గ‌పోరు ముదిరి పార్టీకి రాజీనామాలు చేసే ప‌రిస్థితికి వెళ్లిపోయింది. విజ‌య‌వాడ ఎంపీగా రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన కేశినేని నాని ఆ పార్టీని వీడుతున్న‌ట్లు అధికారికంగా ఆయ‌ప సోష‌ల్‌మీడియాలో తెలిపారు. చంద్ర‌బాబునాయుడు త‌న అవ‌స‌రం పార్టీకి లేద‌న‌ప్పుడు తాను కూడా పార్టీలో కొన‌సాగే అవ‌స‌రం లేదంటూ ట్వీట్ చేశారు. త్వ‌ర‌లో ఢిల్లీ వెల్లి లోక్‌స‌భ స్పీక‌ర్‌ని క‌లిసి త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని తెలిపారు. అనంత‌రం పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. చంద్ర‌బాబు, భువ‌నేశ్వ‌రితో క‌లిసి ఉన్న ఫోటోని ఆయ‌న త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. కార్య‌క‌ర్త‌లు, అనుచ‌రుల స‌మావేశం త‌రువాత త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

విజ‌య‌వాడ ఎంపీగా కేశినేని నాని గెలిచిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేశారు. కేంద్రంలో బీజేపీ పెద్ద‌ల‌ను క‌లిసి విజ‌య‌వాడ పార్ల‌మెంట్‌కు నిధులు తీసుకువ‌చ్చారు. గ్రామాల్లో తాగునీరు స‌మ‌స్య‌ను తీర్చేందుకు వాట‌ర్ ట్యాంక‌ర్ల‌ను అందించారు. ప్ర‌తి గ్రామంలో క‌మ్యూనిటీహాళ్లు, రోడ్లు ఇత‌ర అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. అయితే కేశినేని నానిని పార్టీలో నుంచి పొమ్మ‌న‌లేక‌పోగబెట్టిన‌ట్లు ఉంది. జిల్లాలో మాజీమంత్రి దేవినేని ఉమా వ్య‌వ‌హార‌శైలి న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌తో మొద‌ట విభేధించారు. ఆ త‌రువాత బుద్ధా వెంక‌న్న‌, బోంబా ఉమా, నాగుల్‌మీరాలు ఆయ‌నతో విభేదాలు వ‌చ్చాయి. విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో అన్ని తానై చూస్తున్న స‌మ‌యంలో ఈ ముగ్గురు నేత‌లు మీడియా స‌మావేశం నిర్వ‌హించి కేశినేని నానిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అయిన‌ప్ప‌టికి ఆ విష‌యం అధిష్టానం ప‌ట్టించుకోన‌ప్ప‌టికి ఆయ‌న పార్టీలోనే కొన‌సాగారు. విభేదాల‌న్ని పార్టీ ప‌రిష్క‌రిస్తుంద‌నే భావ‌న‌లోనే వేచి చూసిన కేశినేని నానికి.. అధిష్టానం పార్ల‌మెంట్ విష‌యంలో క‌లుగజేసుకోవ‌ద్ద‌ని చెప్ప‌డంతో ఆయ‌న పార్టీకి రాజీనామా చేస్తున్నారు.

Also Read:  TDP : మైల‌వ‌రంలో బొమ్మ‌సాని ఆత్మీయ స‌మావేశం..

త‌న సోద‌రుడు చిన్నితో ఉన్న కుటుంబ త‌గాదాల‌ను కూడా దేవినేని ఉమా, బుద్ధా, బొండా ఉమాలు ఆస‌రాగా చేసుకున్న వీళ్లు తెర‌మీద‌కు చిన్నిని తీస‌కువ‌చ్చి ఎంపీ టికెట్ రేసులో నిలిపారు.దీంతో అప్ప‌టి నుంచి వ‌ర్గ‌పోరు ముదిరిపోయింది. అది ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసే ప‌రిస్థితికి తీసుకువ‌చ్చింది. కేశినేని నాని రాజీనామా చేసిన త‌రువాత ఏ పార్టీలోకి వెళ్తార‌నే ఉత్కంఠ కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే వైసీపీ పెద్ద‌లు కేశినేనితో ట‌చ్‌లో ఉన్నారు. గ‌త ఏడాది నుంచే ఆయ‌న్ని పార్టీలోకి రావాల‌ని కోరుతున్న‌ట్లు స‌మాచారం. అయితే ఇప్పుడు రాజీనామా చేస్తుండ‌టంతో ఆ పార్టీలోకే వెళ్తార‌నే ప్ర‌చారం బ‌లంగా వినిపిస్తుంది. వైసీపీలోకి వెళ్తే ఎంపీగా ఆయ‌న్నే బ‌రిలోకి దింపుతుంది.