Site icon HashtagU Telugu

Indrakeeladri : కుటుంబ‌స‌మేతంగా బెజ‌వాడ దుర్గ‌మ్మ‌ని ద‌ర్శించుకున్న ఎంపీ కేశినేని నాని

MP Kesineni Nani

MP Kesineni Nani

విజ‌యవాడ ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌ర శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఈ రోజు అమ్మ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్రం సంద‌ర్భంగా భ‌క్తుల‌కు స‌రస్వ‌తీ దేవీగా అమ్మ‌వారు ద‌ర్శ‌న‌మిస్తున్నారు. అమ్మ‌వారిని విజ‌యవాడ ఎంపీ కేశినేని నాని కుటుంబ సమేతంగా దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు.అమ్మ‌వారి దర్శన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆనవాయితీగా వస్తున్న ఆచారం పాటిస్తూ మూలా నక్షత్రం రోజు ఉదయం అమ్మవారిని దర్శించుకుని , ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని ఎంపీ కేశినేని నాని తెలిపారు. అమ్మ వారి ఆశీస్సులతో దర్శనం చాలా బాగా జరిగిందని.. దేశం,రాష్ట్రం బావుండాలని అమ్మ‌వారిని కోరుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి 45 సంవత్సరాలుగా కృషి చేసిన గొప్ప వ్యక్తి అని.. చంద్రబాబు సంపూర్ణ ఆయురారోగ్యాలతో క్షేమంగా బయటకురావలని కోరుకున్నానని ఎంపీ కేశినేని నాని తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు.

Also Read:  Kodali Nani : కొడాని నాని కాన్వాయ్‌కి ప్ర‌మాదం.. దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వెళ్తూ..?