AP : జగన్ తోనే ఉండి చావో.. రేవో తేల్చుకుంటా – ఎంపీ గోరంట్ల

  • Written By:
  • Publish Date - January 4, 2024 / 03:31 PM IST

ఏపీ(AP)లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections 2024) సమయం దగ్గర పడుతుండడం తో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేగంగా మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారో అర్ధం కావడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీ (YCP) లోని నేతలు పెద్ద ఎత్తున బయటకు వస్తూ..టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలలో చేరుతున్నారు. ఉదయం వరకు అదే పార్టీలో ఉన్న నేతలు సాయంత్రం కల్లా సైకిల్ ఎక్కుతున్నారు. ముఖ్యంగా జగన్ పార్టీలో అభ్యర్థుల మార్పు అందరికి గండం గా మారింది. ప్రజల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉన్న క్రమంలో వారికీ టికెట్స్ ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. దీంతో సదరు నేతలంతా వేరే పార్టీలలో చేరుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా హిందూపురం ఎంపీ టికెట్ మహిళా నేత అయిన బీజేపీ మాజీ ఎంపీ శాంత (BJP EX MP Shantha)కు ఇచ్చారు. దీంతో ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav)అధిష్టానం ఫై ఆగ్రహం ఉన్నారని , ఇప్పటికే ఈ విషయంపై పెద్దిరెడ్డి తో మాట్లాడినట్లు ప్రచారం అవ్వడం మొదలైంది. ఈ క్రమంలో ఈ వార్తలపై స్పందించారు. తాను పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. పార్టీ నాకు కన్న తల్లి లాంటిది. వారు ఏ నిర్ణయం తీసుకున్న శిరసావహించడం బాధ్యతగా భావిస్తాను. నేను పార్టీ పెద్దలపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేశారు. అలాగే వైసీపీ లోనే ఉండి చావో.. రేవో తేల్చుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సోషల్ మీడియా నా విషయంలో లేనిపోని హడావిడి చేస్తోందని మండిపడ్డారు.

2019లో టీడీపీ 23 సీట్లకు పరిమితం అయిందని, 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మూడు సీట్లు మాత్రమే మిగులుతాయని మాధవ్ జోస్యం చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు ఇవ్వడంలో భాగంగానే సీఎం జగన్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పులు చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో హిందూపురంలో బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో పెట్టాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డితో నేను గొడవ పడినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి అందరినీ ఓర్పుతో మాట్లాడతారని, అలాంటి వ్యక్తితో నాకు గొడవ ఎందుకు ఉంటుందని అన్నారు. మా పార్టీలో కలహాలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ టీడీపీ నేతలను ఉద్దేశించి గోరంట్ల వ్యాఖ్యానించారు.

Read Also : Pawan Kalyan Divorce Once Again : పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు తీసుకోబోతారని బాంబ్ పేల్చిన జ్యోతిష్యుడు