Jayadev Galla : టీడీపీకి గల్లా జయదేవ్ షాక్..

ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న క్రమంలో టీడీపీ పార్టీ కి భారీ షాక్ తగిలింది. రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ (MP Galla Jayadev ) ప్రకటించారు. తనను రెండుసార్లు గుంటూరు లోక్ సభ స్థానం (Guntur MP) నుంచి గెలిపించినందుకు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటామని కొద్దిరోజుల క్రితమే గల్లా జయదేవ్ కుటుంబం ప్రకటన చేసింది. ఇప్పుడు ఈ […]

Published By: HashtagU Telugu Desk
Galla Goodbay

Galla Goodbay

ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న క్రమంలో టీడీపీ పార్టీ కి భారీ షాక్ తగిలింది. రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ (MP Galla Jayadev ) ప్రకటించారు. తనను రెండుసార్లు గుంటూరు లోక్ సభ స్థానం (Guntur MP) నుంచి గెలిపించినందుకు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటామని కొద్దిరోజుల క్రితమే గల్లా జయదేవ్ కుటుంబం ప్రకటన చేసింది. ఇప్పుడు ఈ విషయంలో గల్లా జయదేవ్ క్లారిటీ ఇచ్చారు.

‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాజకీయాలకు బ్రేక్ తీసుకుంటున్నా. పూర్తిగా బిజినెస్ ఫై దృష్టిసారిస్తా. రాముడు 14 ఏళ్లు వనవాసం వెళ్లి పరాక్రమవంతుడిగా తిరిగొచ్చారు. నేను కూడా అలాగే తిరిగొస్తా. అవకాశం దొరికితే మళ్లీ పోటీ చేస్తా’ అని పేర్కొన్నారు. తన అమరరాజా బ్యాటరీస్ కంపెనీ సహా ఇతర వ్యాపారాలు ఉండడంతో సంస్థను ఇతర దేశాల్లో విస్తరించడం వంటి కార్యకలాపాలు చేపట్టనున్నట్లు గల్లా జయదేవ్ ప్రకటించారు. తాను తన వ్యాపారాలు, రాజకీయాలు కలిపి చేయలేకపోతున్నానని, బిజినెస్ పార్ట్ టైంగా చేయొచ్చు కానీ.. రాజకీయాలు పార్ట్ టైంగా చేయలేమని వివరించారు. అందుకే తాను రాజకీయాల నుంచి వైదొలుతుగుతున్నానని ప్రకటించారు. తన వ్యాపారాలను మరింత విస్తరించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో పలు సమస్యలపై, ప్రత్యేక హోదా విషయంపై, రాజధాని అంశంపై పార్లమెంట్ లో నేను గళమెత్తానని తెలిపారు. ఈ క్రమంలో వివిధ కేసుల్లో ఈడీ నన్ను రెండుసార్లు పిలిచి విచారించిందని, నా వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయని అన్నారు. సీబీఐ, ఈడీ నా ఫోన్ లు ట్యాప్ చేస్తున్నాయని గల్లా జయదేవ్ అన్నారు. రెండేళ్ల క్రితం మా నాన్నకూడా వ్యాపారాల నుంచి రిటైర్డ్ అయ్యారు. ఇకనుంచి పూర్తిస్థాయిలో వ్యాపారాలపై దృష్టిసారించనున్నట్లు గల్లా చెప్పారు. గుంటూరు ప్రజలు నాకు ఇంతకాలం రాజకీయంగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గెలుపోటములు సహజమని చెప్పిన గల్లా, వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని, ఆ తరువాత అవకాశం వస్తే తిరిగి పోటీ చేసే విషయంపై ఆలోచిస్తానని అన్నారు.

Read Also : Silver Broom : అయోధ్య రామమందిరానికి 1.751 కేజీల వెండితో చీపురు

  Last Updated: 28 Jan 2024, 12:21 PM IST