Site icon HashtagU Telugu

MP Balashowry : జనసేనలోకి ముహూర్తం ఫిక్స్ చేసిన బాలశౌరి..సంబరాల్లో పార్టీ శ్రేణులు

Vallabhaneni Balashowry Joi

Vallabhaneni Balashowry Joi

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో అక్కడి రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీ లోకి వెళ్తున్నారో..ఎవరు ఎప్పుడు ఏ షాక్ ఇవ్వబోతున్నారో అర్ధం కావడం లేదు. ముఖ్యముగా అధికార పార్టీ (YCP) తీసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్ ల మార్పు ఆ పార్టీ కి పెద్ద మైనస్ గా మారుతుంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా వరుసపెట్టి బయటకు వస్తున్నారు. మరికొంతమంది ఈసారి జగన్ కష్టమే అని తెలిసి బయటకు వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే పలువురు బయటకు వచ్చి టీడీపీ – జనసేన (TDP-Janasena) పార్టీలలో చేరగా..తాజాగా మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి (MP Balashowry) జనసేన (Janasena) గూటికి వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. రీసెంట్ గా వైసీపీ కి రాజీనామా చేసిన ఈయన..ఆ వెంటనే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో భేటీ అయ్యి పార్టీలో చేరిక ఫై చర్చలు జరిపారు. ఇక ఫిబ్రవరి 4న జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అయ్యారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆయన కండువా కప్పుకోనున్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో బాలశౌరి.. జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా మరోసారి మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.

Read Also : Brain Chip : తొలిసారిగా మనిషి మెదడులోకి చిప్.. ఎందుకు ? ఏమిటి ? ఎలా ?