Viveka Murder Case: సిబిఐ డైరెక్టర్ కు అవినాష్ రెడ్డి లేఖ

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను సిబిఐ పలు దఫాలుగా విచారించింది.

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను సిబిఐ పలు దఫాలుగా విచారించింది. అయితే గతంలో ఈ కేసులో కొన్ని తప్పులు దొర్లాయని, ఆ తప్పుల్ని సవరించాలని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు.

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు. వివేకా హత్య కేసులో గతంలో సిబిఐ అధికారి జరిపిన దర్యాప్తును పునఃసమీక్షించాలని లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు ఆయన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు లేఖ రాస్తూ. గతంలో వివేకా కేసును విచారించిన రామ్ సింగ్ దర్యాప్తును పునఃసమీక్షించాలని లేఖలో కోరారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన సమాచారంతోనే రామ్ సింగ్ విచారణ జరిపినట్టు ఆరోపించారు. తన లేఖలో వివేకా రెండో వివాహం, బెంగుళూరులో ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలను జోడించారు. వివేకా రెండో భార్య పేరిట ఉన్న ఆస్తులను కాజేసే క్రమంలో తనను హత్య చేసినట్టు అవినాష్ తెలిపారు. సో ఈ కేసులో రామ్ సింగ్ దర్యాప్తులో చేసిన తప్పులను సవరించాలని కోరారు.

Also Read: NPS: రోజుకు 100 రూపాయలు సేవ్ చేయండి.. నెలకు 57 వేల రూపాయల పెన్షన్ పొందండి..!