Motkupalli Narasimhulu : చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ఎన్టీఆర్ ఘాట్‌లో బీఆర్ఎస్ నేత మోత్కుప‌ల్లి దీక్ష‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్‌కు నిర‌స‌న‌గా తెలంగాణ సీనియ‌ర్ రాజకీయ నాయ‌కుడు, బీఆర్ఎస్ నేత మోత్కుప‌ల్లి

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 12:25 PM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్‌కు నిర‌స‌న‌గా తెలంగాణ సీనియ‌ర్ రాజకీయ నాయ‌కుడు, బీఆర్ఎస్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు దీక్ష చేప‌ట్టారు. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయ‌న ఒక్క రోజు నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు. ఎన్టీఆర్‌కి నివాళ్లు అర్పించి మోత్కుప‌ల్లి దీక్ష ప్రారంభించారు. సాయంత్ర ఐదు గంట‌ల వ‌ర‌కు నిర‌స‌న దీక్ష జ‌రుగుతంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నారా భువ‌నేశ్వ‌రి ఉసురు ఖ‌చ్చితంగా జ‌గ‌న్‌కు త‌గులుతుంద‌ని.. నారా చంద్ర‌బాబు కుటుంబానికి ప్రాణ‌హాని ఉందంటూ వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో భువ‌నేశ్వ‌రి క‌లిసి జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై మాట్లాడాతాన‌ని ఆయ‌న తెలిపారు. చంద్ర‌బాబు లేకుంటే త‌న‌కు ఎదురులేద‌ని జ‌గ‌న్ అనుకుంటున్నాడ‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధంగా జ‌రిగింద‌ని తెలిపారు. నాలుగు నెల‌ల త‌రువాత జ‌గ‌న్ జెలుకు పోవ‌డం ఖాయ‌మ‌ని.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలిపించ‌మ‌ని తాను ప్ర‌జ‌ల‌ను కోరి పొర‌పాటు చేశాన‌ని తెలిపారు. అప్ప‌ట్లో జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ఇచ్చినందుకు తాను త‌ల‌దించుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు. సీఎం ప‌ద‌వి ఎల్లాకాలం ఉండ‌ద‌ని జ‌గ‌న్ గుర్తుంచుకోవాల‌ని హెచ్చ‌రించారు. చంద్ర‌బాబును ఇబ్బందిపెడితే రాజ‌కీయంగా జ‌గ‌న్‌కే నష్ట‌మ‌న్నారు. చంద్ర‌బాబు అవినీతి చేశారంటే ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని.. జ‌గ‌న్ మ‌ళ్లీ గెలిస్తే ఏపీ రావ‌ణ‌కాష్టంగా త‌యార‌వుతుందన్నారు. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వ‌కుండా ష‌ర్మిల‌ను క‌ట్టుబ‌ట్ట‌ల‌తో బ‌య‌టికి పంపార‌ని.. సొంత‌బాబాయిని చంపిన నిందితుల్ని ప‌ట్టుకోలేని అస‌మ‌ర్థుడు జ‌గ‌న్ అని మోత్కుప‌ల్లి అన్నారు.