ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. కోడలి తలనరికి చంపిన అత్త…కోడలి తలను చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి…పోలీసుల ఎదుట లొంగిపోయింది. అంతేకాదు తన కోడలిని తానే హత్య చేశానంటూ పోలీసుల ఎదుట నిర్భయంగా నేరాన్ని అంగీకరించింది.
రాయచోటి మండలం కె.రామాపురంలో సుబ్బమ్మ నివసిస్తోంది. కోడల వసుంధరతో ఆమెకు కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం ఆవేశంతో ఊగిపోయిన అత్త సుబ్బమ్మ…కోడలు వసుంధరపై దాడికి పాల్పడింది. కత్తి తీసుకుని వసుంధర తలను నరికేసింది.
తెగి పడిన కోడలు వసుంధర తలను చేత పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తన కోడలిని తానే హత్య చేశానని పోలీసులకు చెప్పింది. కోడలి తలతో సుబ్బమ్మ అలా నడుచుకుంటూ..వెళ్తుంటే జనం భయభ్రాంతులకు గురయ్యారు.