Govt Schools: ‘నాడు-నేడు’లో ఇదొక అద్భుత మ‌లుపు!

ప‌దులు కాదు.. వంద‌లు కాదు.. వేల సంఖ్య‌లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అడ్మిష‌న్లు న‌మోద‌వుతున్నాయి.

  • Written By:
  • Updated On - March 11, 2022 / 04:28 PM IST

ప‌దులు కాదు.. వంద‌లు కాదు.. వేల సంఖ్య‌లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అడ్మిష‌న్లు న‌మోద‌వుతున్నాయి. ఏపీ ప్ర‌భుత్వం బ‌డుల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీర్చిదిద్దుతుండ‌టం, మౌలిక వ‌స‌తులు క‌ల్పిండ‌టంతో దాదాపు 45 వేల‌మంది మంది పిల్ల‌లు ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌దివేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆధునిక ఫర్నిచర్, టాయిలెట్లు, 24 గంట‌ల విద్యుత్ సదుపాయాలు లాంటి వ‌స‌తులు కార‌ణంగా గత విద్యా సంవత్సరంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లోని 45,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను విడిచిపెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేర‌బోతున్నారు.

ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టినందుకుగాను, ప్ర‌భుత్వ బ‌డుల్ల్లో మ‌రిన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తుండ‌టంతో విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలవైపు ఆకర్షితులవుతున్నారని మూడు జిల్లాల జిల్లా విద్యాశాఖాధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లాలో 6,91,782 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 3.32 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. గత విద్యా సంవత్సరంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 14,782 కొత్త అడ్మిషన్లు నమోదైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.చంద్రకళ తెలిపారు. “ఈ సంవత్సరం మరిన్ని పాఠశాలలు మౌలిక సదుపాయాలను అమ‌లుచేస్తున్నందుగాకునూ గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరం మాకు ఎక్కువ అడ్మిషన్లు వ‌చ్చాయి.

ఇతర అంశం ఏమిటంటే, ఉపాధ్యాయులకు నైపుణ్యాలను మెరుగుపరచడానికి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడం” అని ఆమె అన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో 3.7 లక్షల మంది విద్యార్థులు ఉండగా, వారిలో లక్ష మంది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. దాదాపు 20 వేల మంది ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను వదిలి వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు డీఈవో ఎం.లింగేశ్వర రెడ్డి తెలిపారు. గ‌తేడాది 10,000 కొత్త అడ్మిషన్లు జరిగిన విజయనగరం జిల్లాలో ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. జిల్లాలో వివిధ పాఠశాలల్లో సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.