Site icon HashtagU Telugu

YSRCP: వైసీపీ కీలక నేతలకు మరిన్ని బాధ్యతలు.!!

Vijayasai Reddy sajjala

Vijayasai Reddy sajjala

వైఎస్సార్సీపీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించిన బాధ్యతలలో స్వల్ప మార్పులు చేశారు. మంగళవారం నాడు అధికారికంగా ఆపార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా ఉత్తర్వుల ప్రకారం సజ్జలకు ఎమ్మెల్యలు, మీడియా కో ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు. విజయసాయిరెడ్డికి రీజినల్ జిల్లా పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల కో ఆర్డినేషన్ బాధ్యతలను అప్పగించారు. గతంలో విజయసాయిరెడ్డికి కేవలం అనుబంధ సంఘాల బాధ్యతలు మాత్రమే అప్పగించారు. అదే సమయంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ పరంగా మరిన్ని బాధ్యతలు అప్పచెప్పారు.

ఈ మేరకు 19వ తేదీన ఉత్తర్వులు వెలువడటంతో..అదే రోజు 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, 11 మంది ప్రాంతీయ సమన్వయకర్తలను కూడా నియమించారు. అయితే 19వ తేదీన వెలువడిన ఉత్తర్వుల ప్రకారం కర్నూలు, నంద్యాల బాధ్యతలు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఈ బాధ్యతలను సజ్జల, బుగ్గన సంయుక్తంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక ఆ బాధ్యతలతో పాటుగా ప్రాంతీయ సమన్వయకర్తల, పార్టీ జిల్లా అధ్యక్షుల కో–ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే తాజాగా ఆ బాధ్యతల విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.